ముంబై (Mumbai) ఎయిర్‌పోర్టు (Airport)లో భారీగా బంగారం (Gold) పట్టుబడింది. రూ.2.52 కోట్ల విలువైన 4.40 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. స్మగ్లర్ల నుంచి 10 ఐఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. ఈ బంగారాన్ని లగేజ్ బ్యాగ్ హ్యాండిల్‌లో దాచి తరలించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించిన కస్టమ్స్ (Customs) అధికారులు.. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు..

దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలలో దేనిని వదిలిపెట్టకుండా ఈ ఆక్రమ రవాణాకు అడ్డాగా మార్చుకొని గోల్డ్ స్మగ్లింగ్ నిర్వహిస్తున్నారు.. ఇందులో భాగంగా కొత్త కొత్త మార్గాలను ఎంచుకొని.. అనుమానం రాకుండా బంగారాన్ని తరలిస్తున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కు వీరు అనుసరిస్తున్న విధానాలు ప్రాణాల మీదికి తెచ్చేలా ఉన్నా లెక్క చేయకుండా ఉంటున్నారు. ఒకవైపు అధికారులు కట్టుదిట్టంగా సోదాలు నిర్వహిస్తున్న ఏ మాత్రం భయం లేకుండా యధేచ్చగా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం ఎయిర్‌పోర్టులో కనిపిస్తుంది.