Telugu News » Australia : ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య..!

Australia : ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య..!

మహిళను హత్య చేసిన నిందితుడు విదేశాలకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మిర్కావే, పాయింట్ కుక్‌లో మహిళ నివాసం ఉండేవారు.

by Venu
Murder in Ap: A YCP worker was brutally murdered by throwing pepper in his eyes..!

ఆస్ట్రేలియా (Australia)లో తెలుగు వైద్యురాలు మృతి చెందిన ఘటన మరువక ముందే మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా (Krishna District)కు చెందిన ఉజ్వల అనే 23 ఏళ్ల వైద్యురాలు ఆస్ట్రేలియాలో ట్రెక్కింగ్ చేస్తూ దుర్మరణం పాలైన విషయ తెలిసిందే.. తాజాగా మరో తెలుగు మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది.

ఆస్ట్రేలియాలోని విక్టోరియా (Victoria)లో హైదరాబాద్‌ (Hyderbad)కు చెందిన మహిళ చైతన్య మాధగాని అలియాస్ శ్వేత దారుణ హత్యకు (Women Murdered) గురైంది. మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న చెత్త డబ్బాలో పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన విక్టోరియా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అంటున్నారు..

మహిళను హత్య చేసిన నిందితుడు విదేశాలకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మిర్కావే, పాయింట్ కుక్‌లో మహిళ నివాసం ఉండేవారు. అయితే శ్వేత భర్త, మూడేళ్ల కుమారుడు హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుస్తోంది. హంతకులు శ్వేతకు తెలిసినవారే అయి ఉంటారని, ఆమెను నమ్మించి, హోటల్ కు తీసుకువచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

You may also like

Leave a Comment