కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై ముంబయి ఇండియన్స్(Mumbai Indians) క్లారిటీ ఇచ్చింది. జట్టుకు ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ(Rohith Sharma)ను కాదని హార్దిక్ పాండ్య(Hardik Pandya)ను సారథిగా నియమించడంపై కోచ్ మార్క్ బోచర్ మాట్లాడాడు.
ఈ మార్పు వెనుక అసలు కారణాన్ని తెలిపాడు. ఇది పూర్తిగా ఆటపరంగా తీసుకున్న నిర్ణయమేనని తెలిపారు. గత రెండు సీజన్లలో రోహిత్ బ్యాట్‌తో సరైన ప్రదర్శన చేయలేకపోయాడని, అందుకే అతడిపై భారాన్ని తగ్గించాలనుకున్నామని తెలిపాడు.
ఇదో పరివర్తన దశ అని, చాలా మందికి ఈ విషయం అర్థంకాక ఎమోషనల్ అయ్యారని మర్క్ బోచర్ తెలిపాడు. కానీ, ఆటకు సంబంధించిన విషయాల్లో ఎమోషన్స్‌ను పక్కన పెట్టాలని సూచించారు. అదేవిధంగా ఓ ఆటగాడిగా హిట్ మ్యాన్ నుంచి మరింత అత్యుత్తమ ప్రదర్శన చూసేందుకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్‌లో క్రికెటేతర బాధ్యతలు కూడా ఈ కెప్టెన్సీ మార్పునకు ఇంకో కారణమని మార్క్ అన్నాడు. లీగ్ టోర్నీలో సారథికి ఆట మాత్రమే కాకుండా చాలా బాధ్యతలుంటాయని చెప్పాడు. ఫొటోషూట్స్, ప్రకటనల వంటివి కూడా అతడే చూసుకోవాలని మార్క్ చెప్పుకొచ్చాడు.