Telugu News » Hyderabad : బతుకమ్మ ఆడొద్దట.. హిందూ పండుగలపై కక్ష!

Hyderabad : బతుకమ్మ ఆడొద్దట.. హిందూ పండుగలపై కక్ష!

మూసారాంబాగ్ శ్రీపురం కాలనీలోని బాలదానమ్మ బస్తీలోని మహిళలు బతుకమ్మ ఆడేందుకు సిద్ధమయ్యారు. అక్కడే ఉండే ఓ పాస్టర్, కొందరు క్రైస్తవులు దీనిని అడ్డుకున్నారు.

by admin
bathukamma-2023

– హిందూ పండుగలపై కుట్ర
– మూసారాంబాగ్ లో రెచ్చిపోయిన పాస్టర్
– బతుకమ్మ ఆడుతున్న మహిళలపై దౌర్జన్యం
– కావాలనే హిందూ మహిళలతో గొడవ
– నోటికొచ్చింది వాగుతూ నానా రచ్చ
– పోలీసుల తీరుపై స్థానికుల ఆగ్రహం
– హిందూ సంఘాల ఎంట్రీతో చర్యలు

ఎన్నో ఏళ్లుగా హిందూ పండుగులపై పాశ్చాత్య దాడి జరుగుతోంది. ఓ కుట్రలో భాగంగా పండుగలను నిర్వీర్యం చేస్తున్నారు కొందరు. స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కొన్నిచోట్ల హిందూ పండుగలు జరుపుకోలేని పరిస్థితి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చిన్నపాటి గొడవతో మొదలుపెట్టి.. పోలీసుల దాకా తీసుకెళ్లి.. మత కల్లోలం పేరుతో పండుగులను నిలిపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) లో ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. బతుకమ్మ పండుగపై ఓ పాస్టర్ (Pastor) తన పైత్యాన్ని చూపించాడు.

bathukamma

మూసారాంబాగ్ శ్రీపురం కాలనీలోని బాలదానమ్మ బస్తీలోని మహిళలు బతుకమ్మ (Bathukamma) ఆడేందుకు సిద్ధమయ్యారు. అక్కడే ఉండే ఓ పాస్టర్, కొందరు క్రైస్తవులు దీనిని అడ్డుకున్నారు. రోడ్డుపై ఓ చోట బతుకమ్మ ఆడేందుకు వచ్చిన హిందూ మహిళలతో గొడవకు దిగారు. బతుకమ్మలపై నీళ్లు జల్లారు. మహిళలు దీనిపై ప్రశ్నించగా.. నోటికొచ్చిన బూతులు తిడుతూ దాడులకు దిగారు. హిందూ మహిళలపై దౌర్జన్యం చేసిన కొందరు క్రైస్తవులు.. తాము అందరిలాంటి మనుషులం కాదని రెచ్చిపోయారు.

musarambagh bathukamma festival issue

ఇళ్ల మధ్యే ఉన్న చర్చి కార్యకలాపాలకు తాము ఏనాడైనా అడ్డుపడ్డామా? అంటూ కాలనీ వాసులంతా కలిసి నిలదీయగా.. దబాయించి మాట్లాడారు. కాలనీ మొత్తం ఏకమైనా.. నోటికొచ్చింది వాగుతూ నానా రచ్చ చేశారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చినా.. వారిని అడ్డుకోలేదు సరికదా ఒక్కమాట కూడా మాట్లాడలేదని అంటున్నారు స్థానికులు. గతేడాది తార్నాకలోని ఓ అపార్ట్ మెంట్ లో దీపావళి వేడుకలను అడ్డుకుంది ఓ క్రైస్తవ కుటుంబం. ఇప్పుడు బతుకమ్మ పండుగపైనా తమ పైత్యాన్ని చూపించారు.

musarambagh bathukamma festival issue 1

ఈ విషయం హిందూ సంఘాలు, బీజేపీ నేతల దాకా చేరడంతో వారు అక్కడకు వెళ్లారు. పాస్టర్, ఇతర క్రైస్తవులు చేసిన పనిపై మండిపడ్డారు. బతుకమ్మలపై నీళ్లు చల్లడం ఏంటని నిలదీశారు. పోలీసులతో చర్చలు జరిపారు. దీంతో చేసేదేం లేక, పోలీసులు సంబంధిత పాస్టర్ పైనా, క్రైస్తవులపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్లో మరెక్కడా హిందూ వేడుకలపై ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా హిందూ బంధువులంతా ఒక్కతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని హిందూ సంఘాల నేతలు, బీజేపీ నాయకులు సూచించారు.

You may also like

Leave a Comment