Muslims : మతాంతర వివాహం చేసుకున్న హిందూ, ముస్లిం జంటలపై దాడులు చేయడం, వారిని వేధించడమే పనిగా పెట్టుకున్న ఛాందస ఇస్లామిస్టులు ‘మోరల్ పోలీసింగ్’ పేరిట కొత్త ర్యాడికల్ ‘వయొలెన్స్’ కి తెర తీశారు. దీన్నే ‘భగ్వా లవ్ ట్రాప్’ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఇందుకు వీళ్ళు వాట్సాప్ వంటి వాటిని వినియోగించుకుంటూ పైశాచికానందం పొందుతున్నారు. ఇండియాలో దేశ వ్యాప్తంగా ఇలాంటి 50 కేసులు వెలుగులోకి వచ్చాయి. బయటపడని చాలా కేసులు ఇంకా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పెడధోరణికి పాల్పడుతున్న ఇస్లామిస్టుల్లో పాకిస్తానీలు కూడా ఉన్నారు.
పెళ్లి చేసుకున్న హిందూ, ముస్లిం జంటలను వీరు వేధిస్తున్న వైనంపై ‘ఓపీ ఇండియా’ రహస్యంగా దర్యాప్తు జరిపింది. ఈ ఇస్లామిస్ట్ బృందాలు ఇలాంటి జంటలమీద నిఘా సర్వేలెన్స్ ని సమన్వయం చేసుకుంటూ బాధితుల రాజ్యాంగ హక్కులను పూర్తిగా కాలరాస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో ‘బెహెన్ బేటీ బచావో’ పేరిట ఓ వాట్సాప్ గ్రూప్ ని వీరు ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది.’
మన ముస్లిం సోదరీమణులను, కూతుళ్లను కాషాయ లేదా హిందూ టెర్రర్ కబంధ హస్తాల నుంచి ఎలా రక్షించుకోవాలో సూచనలు ఇవ్వండి’ అని ఈ గ్రూప్ లో వీరు పేర్కొన్నట్టు వెల్లడైంది. కర్ణాటకలోనాడు హిజాబ్ వివాదం హాట్ హాట్ గా తలెత్తినప్పుడు బుర్ఖా ధరించి హిందూ విద్యార్థుల ముందు ‘అల్లాహో అక్బర్’ అని నినాదం చేసిన ఓ ముస్లిం విద్యార్థిని .’.ముస్కాన్’ ఫోటోను వీరు తమ గ్రూప్ లో డీపీగా పెట్టుకున్నారు. పైగా ఇలియాస్ మెమన్, రయీస్ షేక్, ఫర్హత్ షేక్, హుసేన్ ఖాన్ అనే నలుగురు అడ్మిన్లను కూడా ఈ గ్రూప్ ఏర్పాటు చేసుకుంది.
‘బెహెన్ బేటీ బచావో’ గ్రూప్ లోని 150 మంది సభ్యుల్లో పాకిస్తానీలు కూడా ఉన్నారని సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైంది. ముఖ్యంగా ఇద్దరి ఫోన్ నెంబర్లు +92′ అనే కోడ్ తో ఉన్నాయి. ఈ గ్రూప్ లోని పలువురు ఇస్లామిస్టులు పాకిస్తానీ ప్రాపగాండాని కూడా వినియోగించుకుంటున్నారు. ఇబ్నె ఖాజీ అనే పాకిస్తానీ యూట్యూబర్ .. రెచ్చగొట్టేట్టుగా హిందూ ఫోబిక్ వీడియోలను సృష్టించాడు కూడా. హిందూ భర్తల చేతిలో ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న హింసను చూపే వీడియోలను సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి షేర్ చేశాడు. ఇలాంటివే ఇంకా ఎన్నో ముస్లిములను రెచ్చగొట్టేట్టు ఉన్న వీడియోలు, కరపత్రాలను ఇస్లామిస్టులు సర్క్యులేట్ చేస్తున్నారు.