Telugu News » Nagoba Jatara 2024: వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర.. తరలివస్తున్న భక్తజనం..!

Nagoba Jatara 2024: వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర.. తరలివస్తున్న భక్తజనం..!

కేస్లాపూర్‌(Keslapur) లోని నాగోబా క్షేత్రం(Nagoba Temple)లో జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నాగ శేషుడుని పూజించే ఈ నాగోబా జాతర గంగాజలాభిషేకంతో శ్రీకారం చుట్టారు.

by Mano
Nagoba Jatara 2024: Nagoba Jatara started with grandeur.. Devotees flocking..!

ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) ఇంద్రవెల్లి((Indravelli) మండలం కేస్లాపూర్‌ (Keslapur) లోని నాగోబా క్షేత్రం(Nagoba Temple)లో జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నాగ శేషుడుని పూజించే ఈ నాగోబా జాతర గంగాజలాభిషేకంతో శ్రీకారం చుట్టారు. సంప్రదాయం ప్రకారం మేస్రం వంశపూజారులు ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

Nagoba Jatara 2024: Nagoba Jatara started with grandeur.. Devotees flocking..!

నాగోబా జాతర పూజా విధానం, ఆచార వ్యవహారాలు, నియమ నిష్టలన్నీ ప్రత్యేకమైనవి. తమ పూర్వీకుల్ని స్మరిస్తూ నిర్వహించే పెర్సపాన్ పూజ, కొత్త కోడళ్లను పరిచయం చేసే బేటింగ్ కూడా ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఆదీవాసీల సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే ఆటా పాటాలతో నాగోబా జాతర కన్నుల పండగగా కనిపిస్తుంది.

జాతర ప్రారంభానికి ఒక రాగి చెంబులో కొన్ని పాలను పోసి నవధాన్యాలు, మొలకలు అన్నిటికీ ఒక కొత్త రుమాలును కప్పి గర్భగుడిలోని పుట్టపైన పెడతారు. ఆ రుమాలు కదిలితేనే జాతరకు నాగదేవత అనుమతి ఇచ్చారని అక్కడి వారి నమ్మకం. ఏడు కావిడిలతో నెయ్యి, పుట్ట తేనె, బెల్లం, గానుగ నూనెతో పాటు 125గ్రామాలు తిరిగి కాలినడకన గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు. పుష్యమాస అమవాస్య నాడు అర్ధరాత్రి నాగోబా ఆలయంలో ఈ తంతు నిర్వహిస్తారు.

ఈ ప్రత్యేక పూజలకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆసిఫాబాద్ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ గౌసం ఆలంలు హాజరయ్యారు. నాగోబా జాతర ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలతో సహా ఒడిషా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ నెల 12వ తేదీన నాగోబా దర్బార్ హాల్‌లో అధికారుల సమక్షంలో గిరిజన దర్బార్ నిర్వహించి సమస్యలపై చర్చించనున్నారు.

You may also like

Leave a Comment