Telugu News » Nalgonda : తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదని నిరూపించుకొన్న కేసీఆర్.. వెంకట్ రెడ్డి ఫైర్..!

Nalgonda : తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదని నిరూపించుకొన్న కేసీఆర్.. వెంకట్ రెడ్డి ఫైర్..!

దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకుని నల్లగొండకు వస్తారని ప్రశ్నించారు. ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాకే నల్లగొండకు రావాలని డిమాండ్ చేశారు.

by Venu
https://www.dishadaily.com/telangana/ex-minister-jagdish-reddys-sensational-comments-on-congress-leaders-295618

బీఆర్ఎస్ నేతల విమర్శలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రజలను ప్రాజెక్టుల పేరిట నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌తో కుమ్మకై రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేశారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణను కేసీఆర్ ఎడారిగా మార్చాడని నిప్పులు చెరిగారు.

minister komatireddy venkat reddy accused kcr of cheating the unemployes

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు పాలమూరు-రంగారెడ్డి, ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టులను పట్టించుకోకుండా రాష్ట్రంలో మునిగిపోయే ప్రాజెక్టులు కట్టి వేల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఓడిపోతే ఇంట్లో కూర్చుంటా అని మాట్లాడి.. ఆదరించిన తెలంగాణ (Telangana) ప్రజలపట్ల బాధ్యత లేదని నిరూపించుకొన్న కేసీఆర్ (KCR).. కృష్ణా నది జలాలపై మాట్లాడే హక్కు కోల్పోయారని వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు.

దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకుని నల్లగొండకు వస్తారని ప్రశ్నించారు. ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాకే నల్లగొండకు రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు పనికిరాని బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ (KTR), హరీష్ రావు తమ బడ్జెట్ మీద కామెంట్ చేస్తే.. వారిని ప్రజలే అసహ్యించుకుంటారని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారిగా ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యతనిచ్చామని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసిన ప్రభుత్వ బకాయిలే కనబడుతున్నాయని మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు సర్కార్ రూ.1,200 కోట్లు బకాయి పడిందని, బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో బడ్జెట్‌లో 13 శాతం మేర రూ.13 వేల కోట్లు అప్పులకే పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వాస్తవికత ఉందని మంత్రి తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓఆర్ఆర్ లీజును రూ.7,330 కోట్లకు దారాధత్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వీరి అవినీతిపై ఫోకస్ చేశారని.. త్వరలోనే బీఆర్ఎస్ భాగోతం బయటపడుతుందని వెల్లడించారు..

You may also like

Leave a Comment