Telugu News » Nampally Exhibition: నాంపల్లిలో ‘నుమాయిష్‌’ ఎగ్జిబిషన్.. టికెట్ ధర ఎంతంటే..?

Nampally Exhibition: నాంపల్లిలో ‘నుమాయిష్‌’ ఎగ్జిబిషన్.. టికెట్ ధర ఎంతంటే..?

జనవరి 1న ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) నిర్వహించనున్నారు. 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. టిక్కెట్ ధర రూ.40గా నిర్ణయించారు.

by Mano
Nampally Exhibition: 'Numaish' exhibition in Nampally.. What is the ticket price..?

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌(Nampally Exibition Grounds)లో 83వ నుమాయిష్ (Numaish) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 1న ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

Nampally Exhibition: 'Numaish' exhibition in Nampally.. What is the ticket price..?

జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 2,400 స్టాల్స్ కొలువుదీరనున్నాయి. టిక్కెట్ ధర రూ.40గా నిర్ణయించారు. దాదాపు 22 లక్షల మంది ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారని అధికారులు అంచనా వేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తోంది

మల్టీ పర్పస్ ఉపకరణాలు, దుస్తులు, మంచాలు, వంట సామాగ్రి, మహిళల కోసం వంటసామగ్రి, దుప్పట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బెడ్‌షీట్లు, కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్, కొత్త ఫర్నీచర్ అందుబాటులో ఉన్నాయి. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులను గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు.

ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి ఎనుగుల రాజేందర్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఎగ్జిబిషన్ సందర్శకుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా క్రీడా పోటీలు, వినోద కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఎగ్జిబిషన్ నిర్వహించడం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగాన్ని విస్తరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 33 సబ్ కమిటీల ద్వారా ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

You may also like

Leave a Comment