రాజమండ్రి (Rajamundry) సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ( Chandrababu) కలిసేందుకు ఆయన భార్య నారా భువనేశ్వరి పెట్టుకున్న దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. ఇప్పటివరకు కుటుంబ సభ్యులు రెండుసార్లు కలిశారు.
మొదటి సారిగా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి కలవగా, రెండోసారి.. నిన్న పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ చంద్రబాబును జైలులో కలిసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తర్వాత భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఆయన ఆహారం విషయాన్ని రాజమండ్రిలోనే ఉంటూ భువనేశ్వరి చూసుకుంటున్నారు. మరోవైపు, వారానికి మూడుసార్లు ములాఖత్ కు అవకాశం ఉన్నా.. భువనేశ్వరికి ములాఖత్ నిరాకరించడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసేందుకు సతీమణి భువనేశ్వరి చేసుకున్న ములాఖాత్‌ను జైలు అధికారులు నిరాకరించడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… రాజ్యాంగ విరుద్ధం జగన్ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పేట్టినట్టు వైసీపీ నేతలకు కూడా తెలుసన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులను అన్ని వర్గాల మేధావులు ఖండిస్తున్నారని అన్నారు.
జగన్‌కు అంటుకున్న అవినీతి మరక చంద్రబాబుకు అంటించాలని చూస్తున్నారన్నారు. జగన్ సైకో నే కాదు పిచ్చోడు ఇతను పాలనకు పనికిరారు అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును ఎన్ని రోజులు నిర్బంధించిన చివరకు కడిగిన ముత్యం లాగా బయటికి వస్తారన్నారు. గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించారని తెలిపారు.
చంద్రబాబు భద్రతపై ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారన్నారు. చంద్రబాబుకు ఏమన్నా అయితే జగన్‌కు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం ఆలోచించి ముందుకు వచ్చారన్నారు. పిచ్చోడు జగన్‌ను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని నక్కా ఆనందబాబు వ్యాఖ్యలు చేశారు