122
Tirumala: శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో భారతీయ స్టేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నవీన్ చంద్ర దర్శించుకున్నారు. దర్శనం అనంతరం SBI ద్వారా 93 లక్షలు విలువ చేసే మూడు అంబులెన్స్లను టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి కి అందజేశారు.
జీఎం నవీన్ చంద్ర మాట్లాడుతూ స్వామివారికి సీఎస్‌ఆర్ యాక్టివిటీ కింద భారతీయ స్టేట్ బ్యాంక్ అమరావతి వారు మూడు ట్రావెలర్ అంబులెన్సులు ఇచ్చామని తెలిపారు.
ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు మెరుగైన వైద్యం మరియు సహాయక చర్యలు అందించే విధంగా ఈ అంబులెన్స్ ఉపయోగపడతాయని నవీన్ చంద్ర తెలిపారు.