గత 25 ఏండ్లుగా గుజరాత్ సీఎంగా, ప్రధానిగా పని చేసినప్పటికీ ప్రధాని మోడీ (PM Modi) తనను తాను పేదవాడికి చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun kharge)తెలిపారు. ఎన్నికల ముందు ప్రజల సానుభూతి పొందేందుకే నరేంద్ర మోడీ ఇలా అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారంటూ ఖర్గే తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
రాజస్థాన్‌లోని అనుప్ ఘర్, హనుమాన్ ఘర్ ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. పోర్టుల నుంచి ఎయిర్ పోర్టుల వరకు అన్నింటినీ ప్రధాని మోడీ నియంత్రిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రజలను బానిసలుగా చేసే దిశలో ప్రధాని మోడీ పనిచేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.
తాను మోడీని ఒక అబద్దాల కోరు అని అనడంతో ఆయన బాధపడ్డారని చెప్పారు. గత పదేళ్లలో ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని నిలదీశారు. తదుపరి పర్యటనలో గత హామీల గురించి ప్రధాని మరచి పోతుంటారని ఎద్దేవా చేశారు. తాను ప్రధాని మోడీ తండ్రి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
ప్రధాని మోడీ వయసులో చాలా పెద్ద వారని, ఆయనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాంటి వ్యక్తిని తాను ఎందుకు విమర్శిస్తానని అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో తాను ప్రధాని మోడీ ఓ అబద్దాల కోరు అని, అబద్దాలు చెప్పడంలో కేసీఆర్ అనే వ్యక్తి ప్రధాని మోడీకి తండ్రి లాంటి వాడని విమర్శించానన్నారు.