టాలీవుడ్ నటుడు నవదీప్ (Navdeep) కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన పెట్టుకున్న పిటిషన్‌కు కొట్టేసింది. మత్తు పదార్థాల (Norcotics) కేసులో హీరో నవదీప్ ను విచారించాలన్ని పోలీసుల ప్రయత్నాన్ని అడ్డకోవాలని ఆయన హైకోర్టు (High Court) లో అభ్యర్థన పెట్టుకున్నారు.
మత్తు పదార్థాల కేసులో తనపై జరుగుతున్న విచారణ నిలుపుదల చేయాలని హైకోర్టులో నవదీప్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ ఇవాళ జరిగింది. అయితే హైకోర్టు నవదీప్ పెట్టుకున్న అభ్యర్థను తిరస్కరించింది. 41ఏ ప్రకారం నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. విచారణకు హాజరుకావాల్సిందేనంటూ నవదీప్‌ను సూచించింది.
ఇదివరకే టాలీవుడ్ మత్తు పదార్థాల కేసులో నవదీప్ పేరు రాగా, తాజాగా మరోసారి ఈ కేసులో సినీ ఇండస్ట్రీకి లింకులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మాదాపూర్ మాదకద్రవ్యాల కేసులో హీరో నవదీప్ కు సంబంధం ఉందని 29వ నిందితుడిగా హీరో నవదీప్ పేరు చేర్చినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో ఇది వరకే ఫిల్మ్ ఫైనాన్షియర్ వెంకటరమణారెడ్డితో పాటు డియర్ మేఘ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను నార్కోటిక్ పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. ఆ రాంచంద్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. నవదీప్ ను కన్స్యూమర్ గా ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. దాంతో మాదాపూర్ మత్తు పదార్థాల కేసులో నవదీప్ పేరు చేర్చి దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. నిందితులు తరచుగా హైదరాబాద్‌లో మత్తు పదార్థాల పార్టీలు నిర్వహిస్తున్నారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.