అథ్లెటిక్స్ యూజీన్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా (Neeraj chopra) 2వ స్థానంలో నిలిచారు. శనివారం జరిగిన పురుషుల జావెలిన్ (Javeline) ఫైనల్లో చెక్ రిపబ్లిక్(Check republic) కు చెందిన జాకుబ్ వడ్లెజ్చ్ తర్వాత నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచారు.
నీరజ్ తర్వాత చైనాలో (China) జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొంటారు. జాకుబ్ వడ్లెజ్చ్ 84.01 మీటర్ల త్రోతో ఆధిక్యం సాధించాడు.నీరజ్ రెండో స్థానంలో 83.80 మీటర్లు విసిరి రెండో స్థానానికి చేరుకున్నారు.
నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లో బంగారు పతకాన్ని సాధించారు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు.
ఫైనల్లో నీరజ్ 88.17 మీటర్ల ఉత్తమ ప్రయత్నంతో ప్రపంచ ఛాంపియన్షిప్ స్వర్ణాన్ని గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా ఒలింపిక్ ఛాంపియన్ కోసం సీజన్లో బిజీగా ఉన్న సమయంలో తన ఆసియా క్రీడల కిరీటాన్ని కాపాడుకోవడానికి చైనాకు వెళ్లనున్నారు.