బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంటారు. సొసైటీలోని సమస్యలతో పాటు రాజకీయ, ప్రపంచ వ్యాప్తంగా జరిగే విషయాలపై తనదైన తీరులో స్పందిస్తుంటారు. ఇక తన ప్రత్యర్థులపై ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు.
దీనికితోడు ఎవరైనా కష్టాల్లో ఉన్నామని,ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరితే వెంటనే రెస్పాండ్ అవుతుంటారు. తనవంతు సాయం చేస్తుంటారు.కేటీఆర్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ పోస్టులు , ట్వీట్స్ చేస్తుంటారు.
ఆయనకు సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలానే ఉంది. గతంలో ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో చాలా మంది టెకీలు అయన్ను అనుసరించేవారు. ఇదిలాఉండగ తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ‘జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా కానీ, చిరునవ్వుతో ఎదుర్కోవాలి’ అని క్యాప్షన్ జతచేశారు.
ఇక ఈ పోస్టుపై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Tollywood star heroine Samantha) స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది. దండం పెడుతున్నఎమోజీని ఆమె పోస్టు చేయడంతో కేటీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.మరోవైపు సామ్ ఏ రెస్పాన్స్ ఇచ్చిందని నెటిజన్లు తెగ వెతుకుతున్నారని తెలుస్తోంది.