Telugu News » Joe Biden: ‘ఇజ్రాయెల్ ప్రధాని తప్పు చేస్తున్నారు..’ జోబైడెన్ ఘాటు వ్యాఖ్యలు..!

Joe Biden: ‘ఇజ్రాయెల్ ప్రధాని తప్పు చేస్తున్నారు..’ జోబైడెన్ ఘాటు వ్యాఖ్యలు..!

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిపిన దాడుల్లో హమాస్ ముఖ్యనేత ఇస్మాయిల్ హనియేష్ కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

by Mano
Joe Biden: 'The Prime Minister of Israel is making a mistake..' Joe Biden's harsh comments..!

గాజా(Gaza)పై ఇజ్రాయెల్(Israel) చేస్తున్న వైమానిక దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తప్పు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిపిన దాడుల్లో హమాస్ ముఖ్యనేత ఇస్మాయిల్ హనియేష్ కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇస్మాయిల్ ప్రస్తుతం ఖతార్ ప్రవాసజీవితం గడుపుతున్నారు.

Joe Biden: 'The Prime Minister of Israel is making a mistake..' Joe Biden's harsh comments..!

కుమారులు మాత్రం గాజాలోని శరణార్థి శిబిరంలో ఉండగా ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇస్మాయిల్ స్పందిస్తూ పగ, ప్రతీకారాలతో తన ముగ్గురు పిల్లలను మరో ముగ్గురు మనవళ్లను ఇజ్రాయెల్ అత్యంత దారుణంగా హత్య చేసిందని వాపోయారు. చట్టాలను, విలువలను ఏ మాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తన పిల్లలను చంపినంత మాత్రాన పాలస్తీనా విషయంలో తన వైఖరి మారదని తేల్చిచెప్పారు.

ఈ నేపథ్యంలో జో బైడెన్‌ మాట్లాడుతూ.. నెతన్యాహు వైఖరిని ఏ మాత్రం అంగీకరించబోమని వెల్లడించారు. ఆరు లేదా ఎనిమిది వారాల పాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని ఇజ్రాయెల్‌కు సూచించారు. ఈ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయొచ్చు అని జో బైడెన్ చెప్పుకొచ్చారు. వారం కిందట జరిగిన డ్రోన్ దాడిలో వరల్డ్ కిచెన్ సెంటర్ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు మృతిచెందడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జోర్డాన్, సౌదీ, ఈజిప్ట్ దేశాలు కూడా సహాయం, ఆహారం పంపేలా నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

మరోవైపు శ్వేతసౌధం స్పందిస్తూ సంధి కోసం ఇజ్రాయెల్ కొన్ని చర్యలు తీసుకొందని చెప్తున్నా హమాస్ వైపు స్పందన మాత్రం అంత ప్రోత్సాహకరంగా లేదని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ అమెరికా, ఐక్యరాజ్య సమితి డిమాండ్ చేసిన విధంగానే గాజాలోకి సరఫరాలను పెంచామని తెలిపింది. సోమవారం 468 ట్రక్కులు, మంగళవారం 419 ట్రక్కుల సామగ్రిని తరలించినట్లు వెల్లడించింది. బుధవారం ఉదయం జరిపిన వైమానిక దాడుల్లో కీలక స్థావరాలు, సైనిక మౌలికవసతులను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఓ వీడియోను విడుదల చేసింది.

You may also like

Leave a Comment