ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ఎంపీ (MP) రాఘవ్ చద్దా (Raghav Chadha).. రాజ్యసభ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. నలుగురు ఎంపీలు, రాఘవ్ చద్దాపై సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేయడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేసి, నివేదిక ఇచ్చేంత వరకూ సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని రాజ్యసభ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధంకర్‌కు క్షమాపణలు చెప్పాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆ కేసులో ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఎంపీ రాఘవ క్షమాపణలు చెబితే.. సస్పెన్షన్ ఉండాలా.. కొనసాగించాలా అనే అంశంపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం రాజ్యసభ చైర్మన్ ఉందని కోర్టు వెల్లడించింది. అదీగాక ఈ అంశంపై దివాళీ సెలవులు తర్వాత అప్‌డేట్ ఇవ్వాలని కోర్టు.. అటార్నీ జనరల్ వెంకటరమణిని ఆదేశించింది. మరోవైపు ఎంపీ రాఘవ.. రాజ్యసభ చైర్మన్‌కు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు తెలిపారు.