Telugu News » AP : ఏపీలో కొత్త పార్టీలు.. నష్టం ఎవరికి..?

AP : ఏపీలో కొత్త పార్టీలు.. నష్టం ఎవరికి..?

ఇటీవలి కాలంలో జేడీ లక్ష్మీనారాయణ ఏపీ సర్కార్ విధానాలను ప్రశంసిస్తూ చేసిన ప్రసంగాలతో విమర్శలను ఎదుర్కొన్నారు. జగన్ పార్టీలో చేరతారన్న పుకార్లు సైతం వ్యాపించాయి.. కానీ ఇప్పుడు ఏకంగా సొంతంగా పార్టీ పెట్టడంతో ఆయన జగన్ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ఉద్దేశంతోనే సొంత పార్టీ స్థాపించారా? అన్న అనుమానాలు ఏపీలో వ్యక్తం అవుతున్నాయి.

by Venu
Telangana TDP: TDP away from competition in Telangana..?

-ఏపీలో వేడెక్కుతోన్న రాజకీయాలు..
-టీడీపీ.. జనసేనకి సవాల్ గా మారిన కొత్త పార్టీలు..

తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలు ఎంత ఉత్కంఠగా జరిగాయో.. అందరికీ తెలిసిందే.. ఇప్పుడు ఏపీ (AP) ఎలక్షన్స్ అంతకంటే ఎక్కువ టెన్షన్ పుట్టించేలా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు.. జగన్ (Jagan) ఓటమే లక్ష్యంగా టీడీపీ.. జనసేన బరిలోకి వెళ్తుండగా.. వైసీపీ మాత్రం ఒంటరిగా పోటీకి వెళ్తుందన్న విషయం తెలిసిందే.. అయితే జగన్ ఒంటరిగా వెళ్తున్న.. భారీ వ్యూహంతో ఉన్నారనే మాటలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి..

Telangana TDP: TDP away from competition in Telangana..?

కానీ జనసేన (Janasena).. టీడీపీ (TDP)కి ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి.. ఇప్పటికే వైసీపీ ఓటమిని చూడాలని ఆశపడుతోన్న టీడీపీ.. ఎలాగైనా అధికారాన్ని సొంతం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ పార్టీల మధ్య పోటీ నెలకొంటుందని అంతా భావిస్తున్న సమయంలో.. ఏపీలో కొత్త పార్టీలు తెరమీదికి రావడం ఊహించని విషయం.. సరిగా ఎన్నికల ముందు వచ్చిన కొత్త పార్టీల ప్రభావం వల్ల.. ఓట్ల చీలిక జరుగుతుందనేది విశ్లేషకుల వాదన..

కొత్తగా ఆవిర్భవించిన పార్టీలలో ఒకటి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) నేతృత్వంలోని జై భారత్ నేషనల్ పార్టీ కాగా, రెండోది సినీ దర్శక నిర్మాత సత్యారెడ్డి స్థాపించిన తెలుగు సేన పార్టీ.. వీటితోపాటు జాతీయ జనసేన అనే కొత్త పార్టీ కూడా యాక్టీవ్ అయింది.. దీంతో ఏపీలో గెలుపు పై గంపెడు ఆశలు పెట్టుకొన్న జనసేన, టీడీపీకి ఈ పరిణామం సవాల్ గా మారబోతుందని అనుకొంటున్నారు..

అయితే ఇటీవలి కాలంలో జేడీ లక్ష్మీనారాయణ ఏపీ సర్కార్ విధానాలను ప్రశంసిస్తూ చేసిన ప్రసంగాలతో విమర్శలను ఎదుర్కొన్నారు. జగన్ పార్టీలో చేరతారన్న పుకార్లు సైతం వ్యాపించాయి.. కానీ ఇప్పుడు ఏకంగా సొంతంగా పార్టీ పెట్టడంతో ఆయన జగన్ పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ఉద్దేశంతోనే సొంత పార్టీ స్థాపించారా? అన్న అనుమానాలు ఏపీలో వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు సీనీ దర్శక, నిర్మాత సత్యారెడ్డి స్థాపించిన కొత్త పార్టీ తెలుగుసేన.. కొద్ది నెలల క్రితం పుంగనూరుకు చెందిన పారిశ్రామిక వేత్త బొడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ కూడా ఆవిర్భవించింది. ఇక ఎలాగూ బీజేపీ ఉంది.. కాంగ్రెస్ సైతం ఏపీ ఎన్నికలపై దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీలో వైఎస్‌ఆర్‌కు ఉన్న క్రేజ్‌‌ను వాడుకొని మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని, అందులో భాగంగానే షర్మిలకు పగ్గాలు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

రాబోయే ఎన్నికల్లో బరిలో నిలువనున్న ఈ పార్టీలు టీడీపీ.. జనసేనల ఆశలకి గండికొట్టే అవకాశాలున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతోన్నారు.. అధికార వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుండగా, తెలుగుదేశం, జనసేన పొత్తు కుదుర్చుకుని రంగంలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆవిర్భవించిన కొత్త పార్టీల ప్రభావం ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి నష్టం చేకూరుస్తుంది అన్న చర్చ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది..

You may also like

Leave a Comment