మానవ శరీరంలోని అవయవాలపై అనేక పరిశోధనలు చేసి వైద్యులు అనేక విజయాలను అందుకున్నారు. ఇప్పటి వరకు మనుషుల్లో అనేక అవయవాల మార్పిడిని వైద్యులు విజయవంతంగా మార్చి అద్భుతాలను సృష్టించారు. కిడ్నీ, గుండె మార్పిడి గురించి విన్నాం కానీ ఇది వరకు పూర్తి కన్నును మార్చిన దాఖలాలు లేవు. అయితే, ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్పిడి శస్త్రచికిత్సను అమెరికా సర్జన్లు పూర్తి చేశారు.
న్యూయార్క్ నగరం(New York City)లోని లాంగోన్ హెల్త్ ఆసుపత్రి(Langone Health Hospital) వైద్యులు ఈ ఘనతను సాధించారు. విద్యుత్ తీగలకు తగిలి ఆరన్ జేమ్స్(Aaron James) అనే వ్యక్తి ముఖం చాలా వరకు కాలిపోయి ఒక కన్ను(Eye) మొత్తం పోయింది. దీంతో కుడి కంటిని రెప్పతో సహా మొత్తం మారిస్తే ఆయన ముఖానికి కొత్త చూపు వస్తుందని వైద్యులు భావించారు. మే నెలలో 21గంటల పాటు ఆపరేషన్ చేసి విజయవంతంగా కొత్త కన్ను పెట్టారు. అయితే ఇప్పుడు ఆ కన్ను ఆరోగ్యంగా ఉందని వైద్యులు తాజాగా ప్రకటించారు.
ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్పిడి శస్త్రచికిత్సను అమెరికా సర్జన్లు పూర్తి చేశారు. ఈ చికిత్స జరిగిన వ్యక్తికి తిరిగి చూపు వస్తుందని కచ్చితంగా చెప్పలేకపోయినా.. ఈ చికిత్సను వైద్య రంగ చరిత్రలో కీలక మైలురాయిగా డాక్టర్లు పేర్కొన్నారు. అత్యంత సంక్లిష్టమైన శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా ఓ వ్యక్తి కంటిని న్యూయార్క్ వైద్యులు మార్చారు. ఇప్పటి వరకు కంటిచూపు అంధత్వ లోపాలను సరిచేయడానికి కార్నియా మార్పిడి వంటి చికిత్సలను వైద్యులు చేస్తున్నారు.
ఈ చికిత్సను వైద్య రంగ చరిత్రలో కీలక మైలురాయిగా పలువురు పేర్కొంటున్నారు. గతంలో ఇలా పూర్తి కంటి మార్పిడి చికిత్స జంతువుల్లో కొంతవరకు విజయవంతమై పాక్షికంగా చూపు వచ్చింది. జేమ్స్‌కు అమర్చిన కన్ను ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. ‘చూపును తిరిగి తెప్పించగలమని మేము చెప్పడం లేదు. కానీ దాన్ని సాధ్యం చేయడానికి మరో ముందడుగు వేశామనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని జేమ్స్‌కు సర్జరీ చేసిన బృందంలోని సభ్యుడైన డాక్టర్ రోడ్రిగెజ్ అన్నారు.