Telugu News » NIA Raids: ఎన్‌ఐఏ సోదాలు..ఏకకాలంలో 30 చోట్ల!

NIA Raids: ఎన్‌ఐఏ సోదాలు..ఏకకాలంలో 30 చోట్ల!

వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్‌ఐఎస్ఐ మాడ్యుల్‌లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

by Sai
nia raids 30 places in tamilnadu telanagana in isis radicalization and recruitment

త‌మిళ‌నాడు(Tamilanadu), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వ‌హిస్తోంది. సుమారు 30 చోట్ల ఇవాళ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఐఎస్ఐఎస్ రిక్రూట్మెంట్‌తో లింకున్న కేసులో ఈ సోదాలు చేప‌డుతున్నారు. కోయంబ‌త్తూరులో 21 చోట్ల‌, చెన్నైలో మూడు చోట్ల‌, హైద‌రాబాద్‌లో 5 ప్ర‌దేశాల్లో, టెన్కాశిలో ఒక చోటు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.

nia raids 30 places in tamilnadu telanagana in isis radicalization and recruitment

గ‌త ఏడాది కోయంబ‌త్తూరులో జ‌రిగిన కారు పేలుడు ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసులో.. ఐసిస్ కోణంలో విచార‌ణ చేప‌డుతున్నారు. డీఎంకే కౌన్సిల‌ర్ ఇంట్లో కూడా త‌నిఖీలు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. 82వ వార్డు మెంబ‌ర్ ఎం ముబాసీరాతో పాటు రామ‌స్వామి వీధిలో సోదాలు చేప‌డుతున్నారు.

అయితే ఇప్ప‌టి వ‌రకు ఎటువంటి అరెస్టు జ‌ర‌గ‌లేదు. ఈ కేసుతో లింకు ఉన్న మొహ‌మ్మ‌ద్ అజారుద్దిన్ ను ఇటీవ‌ల అరెస్టు చేసిన అత‌న్ని త్రిసూరులోని జైలులో బంధించారు.హైదరాబాద్ నగరంలో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది.

శనివారం ఉదయం పాతబస్తీ సహా నాలుగుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఐఎస్‌ఐ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి నివాసాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. వివిధ సంస్థలుగా ఏర్పడి ఐఎస్‌ఐఎస్ఐ మాడ్యుల్‌లో అనుమానితులు పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.

You may also like

Leave a Comment