హైదరాబాద్(Hyderabad) బషీర్‌బాగ్ నిజాం కాలేజీ(Nijam College) విద్యార్థులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో ఫుడ్, నీటి సరఫరా లేదంటూ ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్(College principal) దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
దూర ప్రాంతాల నుంచి ఉన్నత చదువుల నిమిత్తం వస్తే కాలేజీలో కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. తమ నీటి సమస్య తీర్చేవరకు ఆందోళనను కొనసాగిస్తామని విద్యార్థులు భీష్మించి కూర్చున్నారు. నెల రోజుల నుంచి హాస్టల్‌లో నీటి ఇబ్బందులతో సతమతమవుతున్నామని వాపోయారు.
నూతనంగా నిర్మించిన మహిళా హాస్టల్‌ను అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కేటాయించాలని విద్యార్థినులు ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. ఐదు రోజుల సమయం అడిగిన ప్రిన్సిపాల్ పీజీ విద్యార్థినులకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను సర్ది చెప్పినా వినిపించుకోకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే, కళాశాల ప్రిన్సిపాల్ మాత్రం ఇటీవలే రూ.లక్ష ఖర్చు చేసి మోటార్ రిపేర్ చేయించామని చెబుతున్నారు.