Telugu News » Nirmala Sitaraman : ఐటీ వార్ షురూ.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

Nirmala Sitaraman : ఐటీ వార్ షురూ.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

2014లో మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడిందని అన్నారు నిర్మలా సీతారామన్. హైదరాబాద్ అభివృద్ధి చెంది.. రెవెన్యూ సెంటర్ గా మారిందని.. కానీ, కేసీఆర్ వల్ల రెవెన్యూ లోటుకు పడిపోయిందని విమర్శించారు.

by admin
nirmala-sitharaman-shocking-comments-on-brs

– కేంద్రం వల్లే నగరానికి అంతర్జాతీయ కంపెనీలు
– మా పాలసీలు నచ్చే అన్నీ వస్తున్నాయి
– తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారు
– రెవెన్యూ లోటుకు తీసుకొచ్చారు
– ఇచ్చిన హామీలు అమలు చేయలేదు
– రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు
– కుటుంబ, అవినీతి పాలన మనకొద్దు
– రాష్ట్ర ప్రజలకు నిర్మలా సీతారామన్ పిలుపు

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న నగరం హైదరాబాద్ (Hyderabad). ఈ అభివృద్ధిపై అనేక వాదనలు ఉన్నాయి. చంద్రబాబు (Chandrababu) పునాది వేశారని టీడీపీ వాళ్లు అంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి కేసీఆర్ (KCR) సీఎం అవ్వడం వల్లే ఇది సాధ్యమైందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడకు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ (KTR) ఇదే వల్లె వేస్తున్నారు. అయితే.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) హైదరాబాద్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

nirmala-sitharaman-shocking-comments-on-brs

కేంద్రంలోని బీజేపీ (BJP) సర్కార్ తీసుకువచ్చిన పాలసీల వల్లే హైదరాబాద్ ​కు అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని అన్నారు కేంద్రమంత్రి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళ్ రావు నగర్‌ లోని ముగ్ధా బాంక్వెట్ హాల్‌ లో ఏర్పాటు చేసిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో నిర్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతం హైదరాబాద్ అని.. కానీ, అలాంటి తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని విమర్శించారు.

2014లో మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడిందని అన్నారు నిర్మలా సీతారామన్. హైదరాబాద్ అభివృద్ధి చెంది.. రెవెన్యూ సెంటర్ గా మారిందని.. కానీ, కేసీఆర్ వల్ల రెవెన్యూ లోటుకు పడిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు పనికొచ్చే పనులు చేయడం లేదన్న ఆమె.. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించినా.. కేసీఆర్ వ్యాట్ తగ్గించకుండా, బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తీసేసి.. మళ్లీ ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

కరోనా సమయంలో ఇబ్బందులు లేకుండా ఆర్థిక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు నిర్మలా సీతారామన్. కానీ, కేసీఆర్ తెలంగాణని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఒక్క ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేదని.. ఇచ్చిన హామీలను మరిచారని విమర్శలు చేశారు. దళిత సీఎం ఎటు పోయిందని ప్రశ్నించారు. కుటుంబ పాలన, అవినీతికి పాల్పడిన ప్రభుత్వం కావాలా? అని ప్రజలను అడిగారు. నవంబర్ 30న జరగబోయే ఎలక్షన్స్ తెలంగాణకు చాలా ముఖ్యమని తెలిపారు.

You may also like

Leave a Comment