Telugu News » NITI Aayog: నీతి అయోగ్ సర్వే.. భారత్‌లో తగ్గిన పేదరికం..!

NITI Aayog: నీతి అయోగ్ సర్వే.. భారత్‌లో తగ్గిన పేదరికం..!

తాజాగా జరిపిన సర్వేలో భారత్‌లో దాదాపు 5శాతం మేర పేదరికం తగ్గిందని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం(NITI Aayog CEO BVR Subramaniam) తెలిపారు. భారత్ విపత్కర పరిస్థితుల నుంచి పురోగతివైపు అడుగులు వేస్తోందన్నారు.

by Mano

భారత్‌(Bharat)లో పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు విజయవంతమైనట్లు నీతి అయోగ్ తెలిపింది. తాజాగా జరిపిన సర్వేలో భారత్‌లో దాదాపు 5శాతం మేర పేదరికం తగ్గిందని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం(NITI Aayog CEO BVR Subramaniam) తెలిపారు. దీన్ని తాజా గృహ వినియోగ డేటా సర్వేను కీలకంగా చేసుకుని అంచనా వేసినట్లు చెప్పుకొచ్చారు.

 NITI Aayog: Niti Aayog Survey.. Reduced poverty in India..!

భారత్ విపత్కర పరిస్థితుల నుంచి పురోగతివైపు అడుగులు వేస్తోందన్నారు. తాము ఆగస్టు 2022 నుంచి జులై 2023ల మధ్య జరిపిన గృహ వినియోగ సర్వేలో వినియోగ వ్యయం గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య 2.5 శాతం పెరుగుదల కనిపించిందన్నారు. పట్టణ గృహాల్లో సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం 2011-12 నుంచి 3.5 శాతం మేర పెరిగి రూ.3,510కి చేరుకుందన్నారు.

అయితే, గ్రామీణ భారతదేశం గణనీయంగా 40.42 శాతం పెరుగుదలలో రూ. 2,008కి చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ డేటా ఆధరంగా దేశంలో పేదరికం 5శాతం లేదా అంతకంటే తగ్గే ఛాన్స్ ఉందని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ఈ సర్వే ఆహారంపై పెడుతున్న ఖర్చు విధానాల్లో మార్పులను కూడా గుర్తించింది అని వెల్లడించారు.

గ్రామీణ కుటుంబాలు మొత్తం వ్యయంలో 50 శాతం శాతం కంటే తక్కువ ఆహారం కోసం కేటాయించినట్లు సర్వేలో తేలింది. అలాగే, పట్టణ- గ్రామీణ వినియోగ విభజన 2004-05లో 91 శాతం నుంచి 2022-23 నాటికి 71 శాతం తగ్గిందని నీతి అయోగ్ పేర్కొనింది.  ఇక, ఆహారంలో పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారం, పాలు, పండ్ల వినియోగం పెరుగుతోందని నీతి అయోగ్ చేసిన సర్వేలో వెల్లడించింది.

You may also like

Leave a Comment