Telugu News » Flex Fuel car:దేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ఆవిష్కరించిన కేంద్ర మంత్రి!

Flex Fuel car:దేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ఆవిష్కరించిన కేంద్ర మంత్రి!

మన దేశ రైతులు కేవలం అన్నదాతలుగానే కాకుండా ఇంధన దాతలుగానూ అవుతారని పేర్కొన్నారు.

by Sai
nitin gadkari launches world first flex fuel car

దేశంలో ఇథనాల్‌కు గిరాకీ పెరుగుతోదంన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(nitin gadkari). ఈ పరిణామం వ్యవసాయ ఆర్థిక వ్సవస్థలో మార్పునకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. దాని ద్వారా మన దేశ రైతులు కేవలం అన్నదాతలుగానే కాకుండా ఇంధన దాతలుగానూ అవుతారని పేర్కొన్నారు.

nitin gadkari launches world first flex fuel car

ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (electrified flexi flueal) వాహన నమూనాను ఇన్నోవా హైక్రాస్ మోడల్‌పై టయోటా కిర్లోస్కర్ అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే మొట్ట మొదటి బీఎస్- 6 స్టేజ్ 2 ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆధారిత కారును మంగళ వారం ఆయన ఆవిష్కరించారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడాన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికగా వ్యవహరిస్తారు.

భారత్‌లో అత్యుత్తమ ఉద్గార ప్రమాణాలకు బీఎస్-6 ప్రమాణాలకు తగినట్లుగా దీనిని రూపొందించారు. 20 శాతానికి మించి కలిపిన ఇథనాల్‌తోనూ ఈ కారు నడవగలదని కంపెనీ తెలిపింది. గాలి కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంలో భాగంగా ముడి చమురు దిగుమతులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం కేంద్రం చూస్తున్న క్రమంలో ఈ కారును విడుదల చేయడం గమనార్హం.

మార్చి, 2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలాపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న లక్ష్యానికి ఈ కారు ఆవిష్కరణ ప్రాముఖ్యతను పెంచుతుంది. ‘ఈ టెక్నాలజీ అభివృద్ధి చేసినందుకు గాను టయోటా కిర్లోస్కర్ యాజమాన్యానికి ధన్యవాదాలు, దేశంలో కాలుష్యం తగ్గేందుకు మాత్రమే కాదు వ్యవసాయ రంగంలో ఉద్యోగావకాశాల సృష్టికి ఇది దోహదం చేస్తుంది.

ఫ్లెక్స్ ఇంజిన్లపై మరిన్ని మోడళ్లను తయారు చేయాలని కోరుతున్నాం. మోటార్ సైకిళ్లు, ఆటోలు, ఇ-రిక్షాలు, కార్లు 100 శాతం ఇథనాల్ వాహనాలుగా మారాలని నేను కోరుకుంటున్నా.’ అని పేర్కొన్నారు నితిన్ గడ్కరీ. ఇథనాల్‌కు గిరాకీ పెరిగితే దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 20 శాతానికి పెరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఇథనాల్ వినియోగాన్ని పెంచాలని కేంద్రం భావిస్తోంది. వసాయాన్ని వైవిధ్యపరచడమే కాకుండా ఇంధన రంగం వైపు మిగులును తరలించి 2జీ టెక్నాలజీతో పంట వ్యర్థాల నుంచి సంపదను సృష్టించాలనుకుంటోంది. చెరుకు వంటి పంట వ్యర్థాలతో ఇథనాల్ తయారు చేస్తారు. దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది.

You may also like

Leave a Comment