87
బీహార్(Bihar) ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar)కాలు జారి కిందపడిపోయారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయన స్టేజీ మీదకు వెళ్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోయారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన ఆయన సెక్యూరిటీ సిబ్బంది ఆయనను పైకి లేపారు.
మంగళవారం పాట్నా(Patna)యూనివర్సిటీలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం నితీశ్ కుమార్ తో పాటు గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్, వైస్ ఛాన్స్‌లర్లు, ప్రొఫెసర్లు అందరూ హాజరయ్యారు.
ఈ క్రమంలో అందరూ కలిసి స్టేజీ మీదకు వెళ్తుండా నితీశ్ కుమార్ ఒక్కసారిగా పట్టుకోల్పోయి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సీఎంను పైకి లేపారు. అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది