సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి.. నిజాం సాగర్ (Nizam Sagar) కాల్వలో పడి గల్లంతైన ఘటనలు వేర్వేరుగా చోటు చేసుకొన్నాయి.. వర్ని (Varni) ఎస్సై కృష్ణ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వర్ని మండలం, అఫందీఫారం (Afandi form) వద్ద నిజాంసాగర్ కాలువలో స్నానానికి వెళ్లి మోచి నారాయణ (20) అనే యువకుడు గల్లంతు అయ్యారు..

ఇదిలా ఉండగా సాగర్ లో మరణించిన మొండి విష్ణు (21) నిజామాబాద్ (Nizamabad) ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ హెల్పర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. శనివారం ఫ్రెండ్స్‌తో కలిసి నిజాంసాగర్ కాల్వలో స్నానానికి వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే ఈత కోడదామని భావించిన అతను కట్టమీది నుంచి కాల్వలోకి దూకడంతో నీటి ప్రవాహనికి కొట్టుకుపోయాడని సమాచారం.
ప్రమాదాన్ని గమనించిన తోటి స్నేహితులు వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై వెల్లడించారు..