ఆధునిక జీవన విధానం.. గత కాలపు సామాజిక రుగ్మతలు పీడిస్తున్నచోట వికసించదు, విస్తరించదు. అది గ్రామమా, నగరమా, మహా నగర సమీప ప్రాంతమా అనే తేడా ఉండదు. శాస్త్రీయ అవగాహన, చైతన్యం బొత్తిగా లేని నేపథ్యం సామాజిక తిరోగమనానికే దారి తీస్తుందని తెలుస్తోంది. మరోవైపు మూఢ నమ్మకాలు.. ఆధునిక విజ్ఞానం, శాస్త్రీయ చైతన్యం చొరబడని ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటాయనే అభిప్రాయం ఉండేది..

స్మశానంలో మేకను బలిచ్చి క్షుద్రపూజలు చేస్తుండంగా కొందరు గ్రామస్తులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపు మాంత్రికుడిని పట్టుకుని దేహాశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. మరోవైపు క్షుద్రపూజల కారణంగా నెల రోజుల్లో 8 మంది చనిపోయారని గ్రామస్తులు ఆరోపించారు.. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.