నేడు నిజామాబాద్ (Nizamabad) పాత కలెక్టరేట్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.. ఇందులో బీఆర్ఎస్ నేతలు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలపై కీలక కామెంట్స్ చేశారు.. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) ఒక్కటే అని.. అందుకే ఇక్కడ అరవింద్ ను గెలిపించడానికే జీవన్ రెడ్డి కి టికెట్ ఇచ్చారని ఆరోపించారు..
సిట్టింగ్ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు పేరుతో రైతులను నట్టేట ముంచాడని.. ఐదు రోజుల్లో పసుపు బోర్డు అని చెప్పి ఐదు సంవత్సరాలు అయిన బోర్డు తెలేదని పేర్కొన్నారు.. రైతులను మరో సారి మోసం చేయడానికే పసుపు రైతులతో కలిసి నామినేషన్ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.. అలాగే అబద్ధపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ కు కర్ర కాల్చి వాత పెట్టాలని ప్రశాంత్ రెడ్డి అన్నారు..
మోసం చేసిన అరవింద్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.. మాజీ మంత్రి గంగుల సైతం తీవ్ర విమర్శలు చేశారు.. అరవింద్ తో పసుపు బోర్డు రాదని తెలిపారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.. కొనుగోలు కేంద్రాల్లో దళారి వ్యవస్థ నడుస్తుందని ఆరోపణలు గుప్పించారు.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆగం అయిందని తెలిపిన ఆయన.. బీజేపీ పై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు..
మరోవైపు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మాట్లాడుతూ.. పదేళ్లలో చేసిన అభివృద్ధిని వంద రోజుల్లోనే కాంగ్రెస్ నాశనం చేసిందని విమర్శించారు.. రాష్ట్రంలో కరెంట్ కోత ఎందుకు వచ్చిందనే విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలన్న ఆయన.. కేసీఆర్ ను ఎందుకు ఓడించామని ప్రజలు బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.. ఎంపీ గా బాజిరెడ్డి గెలిపించి తెలంగాణ ఇజ్జాత్ కాపాడాలని ఓటర్లను కోరారు..