Telugu News » Nizamabad : నీకెందుకురా అయ్యా.. టికెట్ తీసుకోకుంటే ఉద్యోగం ఊడేదా..!!

Nizamabad : నీకెందుకురా అయ్యా.. టికెట్ తీసుకోకుంటే ఉద్యోగం ఊడేదా..!!

. నీకెందుకురా అయ్యా.. టికెట్ తీసుకోకుంటే నీ ఉద్యోగం ఊడేది కాదుకదా! అని కొందరు.. ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుంటే నీ సొమ్ము ఏం పోతుంది అన్న అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.. అయినా ఇన్నాళ్ళూ టికెట్ ఇవ్వకుంటే ఉద్యోగాలు ఊడేవి.. కానీ ఇప్పుడు టికెట్ ఇస్తే జాబులు పోతున్నాయని అనుకుంటున్నారు..

by Venu

తెలంగాణ (Telangana) ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం (Free Travel) కల్పించిన విషయం తెలిసిందే.. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme)లో భాగంగా మహిళలు ఉచితంగా రాష్ట్రంలో ప్రయాణించవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. శనివారం సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఈ స్కీమ్ ప్రారంభించారు. కానీ ఇదేమి పట్టించుకోకుండా ఓ కండక్టర్ మహిళల నుంచి బస్సు ఛార్జీలను వసూలు చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

rtc buses bandh across ap and tdp leaders house arrested

నిజామాబాద్ (Nizamabad) నుంచి బోధన్ వెళ్తున్న ఏపీ 25జెడ్ 0062 నెంబరు బస్సు కండక్టర్.. ఆ బస్సులో ఎక్కిన ముగ్గురు మహిళల నుంచి టికెట్ కోసం డబ్బులు వసూలు చేశాడు.. అయితే మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం కదా.. ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే.. నిర్లక్ష్యంగా కండక్టర్ సమాధానం ఇచ్చినట్టు ఆ మహిళలు ఆరోపించారు.. ఈ ఘటనను వీడియో రికార్డు చేసి నిజామాబాద్ డిపో మేనేజరుకు ఫిర్యాదు చేశారు..

ఈ విషయంపై స్పందించిన నిజామాబాద్ డిపో మేనేజర్.. అతనిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.. అయితే ఈ వీడియోను బాధితులు ట్విట్టర్ లో షేర్ చేశారు.. దీంతో విషయం కాస్త ఆర్టీసీ ఎండీ (RTC MD) సజ్జనార్ (Sajjanar) దృష్టికి వెళ్ళింది. వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు సజ్జనార్.. మరోవైపు ఆ కండక్టర్ బోధన్ డిపోలో పని చేస్తున్న నర్సింహులుగా గుర్తించారు. అతన్నికండక్టర్ విధుల నుంచి తప్పిస్తున్నట్టు ఆర్.ఎం. జాని రెడ్డి వెల్లడించారు..

మరోవైపు ఈ ఘటన పై నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.. నీకెందుకురా అయ్యా.. టికెట్ తీసుకోకుంటే నీ ఉద్యోగం ఊడేది కాదుకదా! అని కొందరు.. ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుంటే నీ సొమ్ము ఏం పోతుంది అన్న అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.. అయినా ఇన్నాళ్ళూ టికెట్ ఇవ్వకుంటే ఉద్యోగాలు ఊడేవి.. కానీ ఇప్పుడు టికెట్ ఇస్తే జాబులు పోతున్నాయని అనుకుంటున్నారు..

You may also like

Leave a Comment