జీవితం అంటే పోరాటం.. ముగింపు కాదు.. జీవితం అంటే ఎవరో ఆపరేట్ చేసే రిమోట్ కాదు.. నీకు నువ్వుగా ఎగిసిపడే కెరటం.. కానీ జీవితం మీద సరైన అవగాహనలేక ఎందరో తమ జీవితాలను అర్ధవంతంగా ముగిస్తున్నారు. జీవితం అంటే కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు, అనే అపోహలు వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. జీవితం అంటే ఒక ఆశయం, ఒక లక్ష్యం, ఒక ప్రయత్నం, ఒక యుద్ధం ఇవన్నీ కలగలిపితేనే జీవితం.. అని తెలుసుకున్న యువత ఆత్మహత్యలు (Suicide) చేసుకోవడం ఆపడం లేదు..
ఇక ఎన్నికల్లో గెలిచి ఏదో సాధిస్తానని కలలు కన్న యువకుడు అర్థాంతరంగా తనువు చాలించాడు. వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. నిజామాబాద్ (Nizamabad) అర్బన్‌లో స్వత్రంత్ర అభ్యర్థిగా (Independent Candidate) పోటీ చేస్తున్న యమగంటి కన్నయ్య గౌడ్ ఆత్మ హత్యకు పాల్పడ్డారు. అలియాన్స్ అఫ్ డెమొక్రటిక్ రిపబ్లిక్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఇతను నిన్న రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది.
ఈ విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే కన్నయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు లోన్ యాప్ వేధింపులే కన్నయ్య మరణానికి కారణం అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కన్నయ్య ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.. కాగా నాయకుడు అవుతాడని భావించిన కొడుకు కానరాని లోకాలకు వెళ్తాడనుకోలేదని కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. రెండు రోజుల్లో గృహప్రవేశం పెట్టుకున్న కన్నయ్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.