Telugu News » Hyderabad : ఘనంగా డాక్టరేట్స్ ప్రదానం.. మీడియా పార్టనర్ గా ‘రాష్ట్ర’

Hyderabad : ఘనంగా డాక్టరేట్స్ ప్రదానం.. మీడియా పార్టనర్ గా ‘రాష్ట్ర’

అహోబల రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ.. అందరిలో భగవంతుడు ఉన్నాడని.. ఆయనకు జయం కలిగితే అందరికీ జయం కలుగుతుందని అన్నారు. వ్యాయామం చేయడంతో విరామయంగా ఉండొచ్చని చెప్పారు.

by admin

ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా, వ్యాయామం చాలా కీలకం. ఈ నేపథ్యంలోనే ‘‘న్యూ మాంక్స్ కుంగ్ ఫూ ఆర్గనైజేషన్ ఇండియా’’ వేల మంది పిల్లలకి ఉచిత సేవలు అందిస్తోంది. ఫ్రీ గా కుంగ్ ఫూ నేర్పిస్తూ వారిని ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతోంది. శనివారం హైదరాబాద్ మ్యారీగోల్డ్ హోటల్ లో ఈ సంస్థకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన యునైటెడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ పలువురికి గౌరవ డాక్టరేట్స్‌ ను అందించింది. ఈ కార్యక్రమానికి మీడియా పార్టనర్ గా వ్యవహరించింది ‘రాష్ట్ర’.

కార్యక్రమంలో భాగంగా ముందుగా చంద్రశేఖర్ లోఖ అండ్ టీమ్ నృత్య ప్రదర్శన జరిగింది. అనంతరం న్యూ మాంక్స్ కుంగ్ ఫూ ఆర్గనైజేషన్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సీహెచ్ వెంకట ఫణి మాట్లాడారు. ఈ సంస్థ 45 ఏండ్ల క్రితం ఎంఎన్ రవి కుమార్ ద్వారా స్థాపించబడిందని తెలిపారు. ప్రస్తుతం తమకు పెద్ద దిక్కుగా సినీ నటుడు డాక్టర్ వీకే నరేష్ ఉన్నారని చెప్పారు. మార్షల్ ఆర్ట్స్, ఉమెన్ ఎంపవర్ మెంట్ లో అందర్నీ చైతన్యవంతుల్ని చేస్తున్నామని.. రవి కుమార్ ఎన్నో కష్టాలు పడ్డారని వివరించారు. ఆయన మొక్కఓని ధైర్యంతో ఈ ఆర్గనైజేషన్ నిలబడిందన్న వెంకట ఫణి… ప్రతీ సంవత్సరం వివిధ రంగాలకు చెందిన వారిని సత్కరించడం జరుగుతోందన్నారు. పదేళ్లుగా బుద్ధ బోధి ధర్మ అవార్డులను అందిస్తున్నామని. అలాగే, హానర్ డాక్టరేట్స్ ఇప్పించడం జరుగుతోందని తెలిపారు. న్యూ మాంక్స్ కుంగ్ ఫూ ఆర్గనైజేషన్ కు దేశమంతా శాఖలు ఉన్నాయని.. ఏ విధమైన రుసుము తీసుకోకుండా గ్రామాల్లో, స్కూళ్లలో అక్కడివారిని ఉచితంగా చైతన్యవంతుల్ని చేస్తున్నామని చెప్పారు. దీనికి సహ బ్రాంచ్ గా నాలుగేళ్ల క్రితం న్యూ మాంక్స్ యోగా అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా స్థాపించామన్న ఆయన… దీని ద్వారా కూడా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. శారీరకంగా, మానసికంగా ప్రజలను ధైర్యవంతుల్ని చేయాలని సంకల్పించామని.. ఏ సంస్థ అయినా ముందుకు నడవాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరమని.. నరేష్ చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.

సభా వేదికపై బుద్ధ బోధి ధర్మ అవార్డులను అందజేశారు. అహోబల రామానుజ జీయర్ స్వామి, చిత్రగుప్త పీఠాధీశ్వర్ స్వామి సచ్చిదానంద పశుపతి, సినీ నటి పవిత్ర లోకేశ్, ‘మా’ వైస్ ప్రెడిటెంట్ మాదాల రవి, న్యూ మాంక్స్ కుంగ్ ఫూ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు రాజ శిఖామణి, రాష్ట్ర అధ్యక్షుడు కుంచపు రాంబాబు, ఎంపీ, సినీ నటి సుమలత, జయసుధ, మురళీ మోహన్, శ్యాం సుందర్ గౌడ్, అడ్వకేట్ రేవతి, నేషనల్ లీగల్ అడ్వైజర్ దామోదర్ హాజరయ్యారు. రెడ్డి ల్యాబ్స్ డైరెక్టర్ వీఎన్ భాస్కర్ కు అవార్డు ప్రదానం చేశారు. వ్యాపారవేత్త జీ శ్రీనివాస్, తమిళనాడు పోలీస్ ధనశేఖరన్, ఎస్పీ విజయ్ సింగ్, ఏసీపీ రవికుమార్, నిర్మాత రాక్ లైన్ వెంకటేశ్, మాదాల రవి, శివబాలాజీ, టర్కీ కౌన్సిలర్ జనరల్ ఎమాంగ్ లకు అవార్డులను అందించారు. ఈ కార్యక్రమానికి మీడియా పార్టనర్ గా ఉన్న ‘రాష్ట్ర’ బ్రాడ్ కాస్టింగ్ చైర్మన్ వేమూరి శ్రీరామ్ పవన్ కుమార్ కి బుద్ధ బోధి ధర్మ అవార్డును అందజేశారు.

కార్యక్రమంలో ముందుగా ‘మా’ వైస్ ప్రెడిటెంట్ మాదాల రవి ప్రసంగించారు. సామాజిక చైతన్యం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారని.. తాము కూడా ఇదే ఆశయంతో సినీ ఇండస్ట్రీకి వచ్చామని చెప్పారు. ఒక కుంగ్ ఫూ ఆర్గనైజేషన్ ద్వారా కూడా సామాజిక చైతన్యం తీసుకురావొచ్చు అని వీళ్లు నిరూపించారని కొనియాడారు. ఈ సంస్థ నిర్వాహకులకు విప్లవాభివందనాలు తెలిపిన ఆయన.. నరేష్ గొప్ప నటుడని అన్నారు. తన ఫుడ్ తాను తినడం ప్రకృతి, ఎదుటివాడి ఫుడ్ లాక్కొని తినడం వికృతి, నలుగురితో పంచుకుని తినడం సంస్కృతి అంటూ మాట్లాడారు.

అహోబల రామానుజ జీయర్ స్వామి, చిత్రగుప్త పీఠాధీశ్వర్ స్వామి సచ్చిదానంద పశుపతి, నరేష్ సహా తదితరులు జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ.. ఎంఎన్ రవికుమార్ కష్టజీవి అని.. జీవిత కాలాన్ని మార్షల్ ఆర్ట్స్, కుంగ్ ఫూ కోసం కష్టపడ్డారని తెలిపారు. ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికైన రిటైర్డ్ ఎస్పీ రాజ శిఖామణికి కంగ్రాట్స్ చెప్పారు. 45 సంవత్సరాలుగా ఇది ఎదుగుతూ వేల మంది పిల్లలకు, యువతకు ఉపయోగపడిందని వివరించారు. ఈ సందర్భంగా వ్యాయామంపై స్వామి వివేకానంద చెప్పిన మాటలను గుర్తు చేశారు నరేష్. కుంగ్ ఫూ ని వేలమంది పిల్లలకు ఉచితంగా నేర్పిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ‘రాష్ట్ర’ చైర్మన్ వేమూరి శ్రీరామ్ పవన్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

అహోబల రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ.. అందరిలో భగవంతుడు ఉన్నాడని.. ఆయనకు జయం కలిగితే అందరికీ జయం కలుగుతుందని అన్నారు. వ్యాయామం చేయడంతో విరామయంగా ఉండొచ్చని చెప్పారు. న్యూ మాంక్స్ కుంగ్ ఫూ ఆర్గనైజేషన్ మంచి కార్యక్రమాలు చేపడుతోందని.. రవి కుమార్ తమ ఆశ్రమంలోని పిల్లలకు కరాటే నేర్పిస్తుంటారని చెప్పారు. ఆయన పిలవగానే వెంటనే వచ్చేశామని.. డాక్టరేట్ తీసుకున్న వారికి కంగ్రాట్స్ తెలియజేశారు.

చిత్రగుప్త పీఠాధీశ్వర్ స్వామి సచ్చిదానంద పశుపతి మాట్లాడుతూ.. భారత్ మాతా కీ జై, వందేమాతరం అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. హైదరాబాద్ లాంటి పవిత్ర ప్రదేశాన్ని రావడం సంతోషంగా ఉందన్నారు. న్యూ మాంక్స్ కుంగ్ ఫూ ఆర్గనైజేషన్ మంచి సంస్థ అని.. జనవరిలో ఎందరో మహానుభావులు పుట్టారు.. అలాంటి నెలలో ఈ మంచి కార్యక్రమం జరగడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఇక, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కీ రోల్ పోషించిన నరేష్ కు ధన్యవాదాలు తెలిపారు న్యూ మాంక్స్ కుంగ్ ఫూ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు రాజ శిఖామణి. మేజిస్ట్రేట్ మాధవరావు, సుప్రీంకోర్టు అడ్వకేట్ వరప్రసాద్ ఎంతో చేశారని.. ఈ సంస్థను ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ప్రపంచమంతా కుంగ్ ఫూ ని వ్యాపింపజేసేందుకు రవి కుమార్ యూనివర్సిటీని స్థాపిస్తున్నారని.. దీనికి తామంతా తోడుగా ఉంటామని తెలిపారు. ఈ విద్యను అందరికీ తెలియజేయాలని చూస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమానికి టర్కీ కౌన్సిలర్ జనరల్ ఎమాంగ్ హాజరయ్యారు. ఇది చాలా మంచి కార్యక్రమమని… తనను పిలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. టర్కీ, హైదరాబాద్ కు చరిత్ర పరంగా పోలికలు ఉన్నాయని.. తమకు విడదీయరాని అనుబంధం ఉందని తెలిపారు.

నరేష్ కుమారుడు, దర్శకుడు నవీన్ విజయకృష్ణను ఈ సందర్భంగా సత్కరించారు. సీనియర్ నటి జయసుధ ఆయనకు బుద్ధ బోధి ధర్మ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ.. న్యూ మాంక్స్ ఆర్గనైజేషన్ తనను పిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. పిల్లల్లో ధైర్యం నింపుతున్న ఈ సంస్థ సేవలు ఎనలేనివని కొనియాడారు. తర్వాత నటి పవిత్ర లోకేశ్ ని సత్కరించారు. సీనియర్ నటీమణులు సుమలత, జయసుధ చేతులమీదుగా ఇది జరిగింది. ఆ తర్వాత జయసుధ, నటుడు మురళీమోహన్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. నరేష్ ఎంతో గొప్ప నటుడని చెప్పారు. ఏ పాత్ర ఇచ్చినా ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తారని తెలిపారు. అనంతరం అందరూ కలిసి నరేష్ ను సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు గజమాల వేసి గదను అందించారు. అనంతరం డాక్టరేట్ ప్రదానోత్సవం జరిగింది. మొత్తం 22 మందికి డాక్టరేట్స్ అందించారు. అనంతరం నరుష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు.

డాక్టరేట్ అందుకుంది వీళ్లే..

సుమలత, ఎంపీ, సినీ నటి
మాధవరావు, జడ్జి
శివమణి, మ్యూజిక్ డైరెక్టర్
షేక్ బేగం, ఐపీఎస్
రజినీకాంత్, టీవీ9 మేనేజింగ్ ఎడిటర్
కరుణకుమార్, జడ్జి
మధన్ మోహన్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్
పొన్నం రవిచందర్, సీనియర్ జర్నలిస్ట్
వాణి శ్రీకాంత్ రాజ్, ఆరాధ్య ఫౌండేషన్
వై సైదిలు, వ్యాపారవేత్త
ఆంజనేయరెడ్డి, థమన్ ఫౌండేషన్
ప్రసాద్ రావు, మ్యూజిషియన్
సాంబశివరావు, స్పిరుచ్యువల్ సైంటిస్ట్
దుర్గారావు, సోషలిస్ట్
కిరణ్ చైతన్య
అల్లిబోయిన శ్రీను, స్పోర్ట్స్
అనుదీప్ కుమార్, కేఎస్ఆర్ గ్రూప్
శ్రీపాద శ్రీనివాస్, అపెక్స్ డైరెక్టర్
రాజేంద్రప్రసాద్, ఫిట్ నెస్ మేన్
రమేష్ తేజ, వ్యాపారవేత్త
ప్రకాష్ రాజ్, సోషలిస్ట్
అనిల్ కుమార్ రెడ్డి, సోషలిస్ట్

You may also like

Leave a Comment