Telugu News » Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాలు దొరకలే.. ఇక ఈ కేసు పక్కకు పోయినట్టేనా?

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాలు దొరకలే.. ఇక ఈ కేసు పక్కకు పోయినట్టేనా?

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tappin case)లో మొన్నటివరకు దూకుడుగా వ్యహరించిన విచారణ బృందం(Investigative team) ఒక్కసారిగా నెమ్మదించినట్లు తెలుస్తోంది. సాక్ష్యాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

by Sai
No evidence can be found in the phone tapping case.. Is this case dropped?

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tappin case)లో మొన్నటివరకు దూకుడుగా వ్యహరించిన విచారణ బృందం(Investigative team) ఒక్కసారిగా నెమ్మదించినట్లు తెలుస్తోంది. సాక్ష్యాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. డబ్బులు చేతులు మారాయి. ఎస్‌ఐబీ పోలీసుల బృందం ఎన్నో అక్రమాలకు పాల్పడింది. కానీ, వీటన్నింటికీ సాలిడ్ ఆధారాలు ఎక్కడా? అని అడిగితే ప్రత్యేక విచారణ బృందం అధికారులు నోరెళ్ల బెడుతున్నారు.

ట్యాపింగ్ ద్వారా తప్పుడు పనులు చేశారు. అందుకు సాక్ష్యాలున్నాయి. బాధితులు కోర్టు ముందుకు వచ్చి సమాధానం చెప్పగలరు. కానీ, ఆ అక్రమాలు ఫోన్ ట్యాపింగ్ వల్లే చేశాము అనడానికి ఇప్పుడు పోలీసుల వద్ద ఆధారాలు కరువయ్యాయి.

No evidence can be found in the phone tapping case.. Is this case dropped?

ఎందుకంటే, ఎస్ఐబీ సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు అటు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియగానే చాలా తెలివిగా సాక్ష్యాలన్నింటినీ (Proofs demolished) నాశనం చేశాడు. రికవరీకి పనిరాకుండా ఎలా ధ్వంసం చేయాలో అలా చేశాడు. హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్స్, సీసీ కెమెరాల ఫుటేజీ అన్నింటిని మార్చేశాడు. పాత హార్డు డిస్కుల్లోని డేటాను తన సొంత స్టోరేజ్ డివైజుల్లో స్టోర్ చేసుకున్నాడు. వాటిని ఎక్కడో దాచేసి విచారణ అధికారులకు ఏమీ చెప్పడం లేదు.

ధ్వంసమైన డివైజెస్ గురించి మాత్రమే నోరు విప్పిన ప్రణీత్ రావు, తన వద్దనున్న సీక్రెట్ స్టోరింగ్ డివైజులను ఎక్కడ పెట్టాడనే విషయం గురించి నోరు విప్పలేదని తెలిసింది. అయితే, కేవలం వాంగ్మూలం ఆధారంగా కేసును నడపడం సాధ్యమా? అనే డౌట్ పోలీసులు కూడా వస్తోంది. ట్యాపింగ్ పరికరాలు సమకూర్చిన వ్యక్తి, ట్యాపింగ్ ద్వారా ఎవరెవరి నుంచి ఎంత డేటా సేకరించారు అనేది లేకుండా కోర్టులో నేరాన్ని ఎలా ప్రూవ్ చేయాలని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధం. కానీ రికార్డింగ్ సమాచారం సోర్స్ ఫైల్ నుంచి కాపీ చేసి పెన్‌డ్రైవ్‌లో వేసి బడా నేతలకు రాధాకిషన్ రావు టీం అధికారులు పంపేవారు.కనీసం ఆ పెన్ డ్రైవ్ దొరికినా ఈ కేసు కీలక మలుపు తిరుగుతుంది. కానీ, సరైన ఆధారాలు లేని కారణంగా ఈ కేసు లీగల్‌‌గా నిలబడుతుందా? లేదా అనే ప్రశ్నలు అందరిలో మెదులు తున్నాయి. కాగా, దేశంలో నేటికి టెలిగ్రాఫ్ చట్టం కింద ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. అందుకు సాక్ష్యాలు లేకపోవడమే కారణంగా తెలుస్తోంది.

You may also like

Leave a Comment