Telugu News » No opposition in the village: ఆ గ్రామమంతా బీఆర్ఎస్ కి జై కొట్టారు

No opposition in the village: ఆ గ్రామమంతా బీఆర్ఎస్ కి జై కొట్టారు

ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే మళ్లీ కావాలని కోరుకుంటూ నాగారం గ్రామంలోని అన్ని పార్టీలు బీఆర్ఎస్ లో కలిశాయి. రానున్న రోజుల్లో అన్ని గ్రామాలు ఇదే స్ఫూర్తితో ఒకే తాటిపై వస్తాయి

by Prasanna

No opposition in the village: ఆ గ్రామమంతా బీఆర్ఎస్ కి జై కొట్టారు

వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం నాగారం (Nagaram) గ్రామస్థులంతా బీఆర్‌ఎస్‌ (BRS) కండువాలు కప్పుకున్నారు. ఇప్పటీ వరకు కాంగ్రెస్‌ (Congress), బీజేపీ (BJP) పార్టీలకు పని చేసిన నాగారం గ్రామంలోని ఆ పార్టీల ముఖ్యనాయకులు, మాజీ సర్పంచ్‌, వార్డుమెంబర్లు, వందకుపైగా కుటుంబాలు గులాబీ పార్టీలో చేరిపోయారు. దీంతో ఆ గ్రామంలో ప్రతిపక్షం లేని గ్రామంగా నాగారం నిలిచింది.

BRS joinings

బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. “బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూసి, ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే మళ్లీ కావాలని కోరుకుంటూ నాగారం గ్రామంలోని అన్ని పార్టీలు బీఆర్ఎస్ లో కలిశాయి. రానున్న రోజుల్లో అన్ని గ్రామాలు ఇదే స్ఫూర్తితో ఒకే తాటిపై వస్తాయి” అని ఎమ్మేల్యే పెద్ద సుదర్శన్‌ రెడ్డి అన్నారు

కాంగ్రెస్‌ నుంచి వార్డు మెంబర్‌ నాంపల్లి శ్రీను, రేబల్లి లోకేశ్‌, ఉండ్రాతి వెంకన్న, రామడుగు రాజు, గండ్ల భిక్షపతితోపాటు పలు కుటుంబాలు, బీజేపీ నుంచి మాజీ సర్పంచ్‌ శీలం వెంకన్న, వార్డు సభ్యులు సువర్ణ, సుజాతాముఖేశ్‌, చెంచు వెంకటలక్ష్మి, దారపు వెంకటేశ్‌తోపాటు పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ పెద్ది స్వప్న, ఎంపీపీ జాటోత్‌ రమేశ్‌, జడ్పీటీసీ లావుడ్య సరోజాహరికిషన్‌, ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment