దేశంలోనే అత్యంత ప్రజాదరణ గల ముఖ్యమంత్రి(CM)గా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) నిలిచారు. ఇటీవల దేశంలోనే మోస్ట్ పాపులర్ (Most Popular Chief Minister)సీఎం ఎవరనే అంశంపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు ఆయనకు 52.7 మంది ప్రజలు ఓటు వేశారు.
దేశంలో అత్యంత ప్రాధాన్యత గల రెండవ సీఎంగా యోగీ ఆదిత్యనాథ్ నిలిచారు. యోగీ ఆదిత్యనాథ్‌కు 51.3 మంది ఓటు వేశారు. ఇక ఈ జాబితాలో అసోం సీఎం హిమంత బిస్వ శర్మ మూడవ స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో 48.6 శాతం మంది ప్రజలు ఉత్తమ సీఎంగా ఆయన వైపు మొగ్గు చూపారు.
ఇక నాలుగవ మోస్ట్ పాపులర్ సీఎంగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ నిలిచారు. 42.6 శాతం ప్రజలు ఆయనకు మద్దతుగా నిలిచారు. 2021 నుంచి ఆయన గుజరాత్ సీఎంగా పని చేస్తున్నారు. ఇక ఐదవ ప్రజాదరణ కలిగిన సీఎంగా త్రిపుర సీఎం మాణిక్ సాహా నిలిచారు. ఆయనకు 41.4 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు.
సర్వేలో త్రిపుర సీఎంపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన అంకితభావం, నిజాయితీ ఆయన నాయకత్వంలో సాధించిన అభివృద్ధిని గురించి ప్రజలు ప్రశంసించారు. తమ సుఖదుఃఖాల్లో పాలుపంచుకునే గొప్ప నాయకుడు మాణిక్ సాహా అంటూ ఆకాశానికి ఎత్తారు.