గుజరాత్ జంట హత్యల కేసు(Gujarat twin murder case)లో నిందితులుగా ఉన్న భారత సంతతి దంపతులను అప్పగించేందుకు బ్రిటన్ నిరాకరించింది. భారత ప్రభుత్వం(Government of India) అభ్యర్థించినా అక్కడి న్యాయస్థానాలు ససేమిరా అన్నాయి.
తీగలాగితే డొంకంతా కదిలినట్లు 2021 మేలో ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ తనిఖీ చేయగా సిడ్నీలో కొకైన్ ప్యాకెట్లు పట్టుబడిన కేసులో భారత సంతతికి చెందిన దీర్, రైజాడను అరెస్ట్ చేశారు. కమర్షియల్ విమానాల్లో సిడ్నీ నుంచి లండన్‌కు రూ.600కోట్ల విలువైన కొకైన్ తరలిస్తున్నారన్న అభియోగం, హవాలా లావాదేవీల కేసులో దోషులుగా నిర్ధారించారు.
నైరోబీలో జన్మించిన భారత సంతతి బ్రిటిష్ పౌరురాలు ఆర్తి ధీర్, ఆమె భర్త కవల్జిత్ సింగ్ రైజాడాలు లండన్ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి 514 కిలోల కొకైన్ తరలించారు. బ్రిటన్ ఎన్సీఏ అధికారుల దర్యాప్తులో వారింట్లో లక్షల కొద్దీ పౌండ్లు బయటపడ్డాయి. ఈ ఆరోపణలను ధీర్, రైజాడా నిరాకరించినా అక్రమ ఎగుమతుల కేసులో 12 కౌంట్లు, హవాలా లావాదేవీల కేసులో అక్కడి కోర్టు 18కౌంట్ల జైలుశిక్షను విధించింది.
ధీర్, రైజాడ దంపతులు చట్ట విరుద్ధంగా సంపాదించిన ఆస్తుల స్వాధీనంపై ఎన్సీఏ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ కొకైన్ తరలించిన సంస్థ వెనుక ఉన్నది వీరిద్దరేనని నిర్ధారణకు అధికారులు వచ్చారు. దీనిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ జంట ఏర్పాటు చేసిన కంపెనీకి ఈ కొకైన్ ప్యాకెట్లు చేరాయని గుర్తించారు. సదరు కొకైన్ ప్యాకెట్లపై రైజాడ ఫింగర్ ప్రింట్స్‌ను సరిపోయాయని తెలిపారు.