Telugu News » Operation Ajay : భారత్ ఔన్నత్యం.. ఆరో విడత ఆపరేషన్‌ అజయ్‌ సక్సెస్..!!

Operation Ajay : భారత్ ఔన్నత్యం.. ఆరో విడత ఆపరేషన్‌ అజయ్‌ సక్సెస్..!!

ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య జరిగే యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం దారుణమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆందోళన పడుతుంది యావత్ ప్రపంచం.. ఎందుకంటే ఇప్పటికే వేలాది మంద్రి ప్రాణాలు కోల్పోయారు.

by Venu

ఇజ్రాయెల్‌ – హమాస్‌ (Israel – Hamas) మధ్య యుద్ధం (WAR).. ఆధిపత్య పోరు అనుకోవాలా.. అహంకార పోరు అనుకోవాలా అనేది ఎవరికి అర్ధం కాకుండా ఉంది. కానీ నష్టం మాత్రం ఊహించని విధంగా ఉంది. ఈ పోరుభూమిలో మరణం వికృతంగా నాట్యం చేస్తోంది. ఆర్తనాదాలతో, మరణఘోషతో అక్కడి నేల రక్తసిక్తం అయింది..

Third Operation Ajay flight carrying 197 Indian nationals from war-torn Israel arrives in Delhi

మరోవైపు ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య జరిగే యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం దారుణమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఆందోళన పడుతుంది యావత్ ప్రపంచం.. ఎందుకంటే ఇప్పటికే వేలాది మంద్రి ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఈ అప్రకటిత యుద్ధం వల్ల ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తీసుకురావడానికి భారత్ ఆపరేషన్‌ అజయ్‌ చేపట్టింది..

ఈ ఆపరేషన్‌ అజయ్‌ (Operation Ajay)లో భాగంగా కేంద్రం ఆరో విడతలో 143 మంది ప్రయాణికులను తరలించింది. ఇందులో ఇద్దరు నేపాల్‌ పౌరులు కూడా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఇజ్రాయెల్‌ లో చిక్కుకున్న వారితో బయలుదేరిన విమానం క్షేమగా ఢిల్లీకి చేరింది.. ఈ ప్రయాణికులకు కేంద్ర సహాయశాఖ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే (Phaggan‌ Sing‌h Kulaste) స్వాగతం పలికారు. విమానం సురక్షితంగా రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment