సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న రామ మందిర ప్రారంభోత్సవ వేడుక యూపీ (UP) ఆతిథ్య సంస్కృతిని పరిచయం చేసేందుకు ఒక మంచి అవకాశం అని ఆ రాష్ట్ర సీఎం యోగీ ఆదిత్యనాథ్ ( Yogi Adityanath) అన్నారు. అయోధ్య ధామ్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కృషి చేయాలని ట్వీట్లో అధికారులకు సూచించారు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ‘నవ్య-దివ్య-భవ్య ఆలయంపై పూలవర్షం కురిపించే కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. అందువల్ల ట్రస్టు, ఎయిర్ ఫోర్స్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచనలు చేశారు. రాముల వారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు రానున్నట్టు తెలిపారు.
ఇక్కడ నియమించిబడిన పోలీసుల ప్రవర్తన రాష్ట్ర ప్రతిష్టను ప్రభావితం చేస్తుందన్నారు. అందువల్ల పోలీసులు భక్తుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచనలు చేశారు. సరయూ నది పాత వంతెనపై ట్రాఫిక్‌ను అనుమతించవద్దని ఆదేశించారు. సరయూ నదిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను జాగ్రత్తగా ఉండాలని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.
జనవరి 22 వేడుక, ఆ తర్వాత రోజు నుంచి భారీ సంఖ్యలో భక్తులు అయోధ్యను దర్శించుకోనున్నారని చెప్పారు. అందువల్ల పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ కోసం మెరుగైన ప్రణాళికను రూపొందించుకోవాలని పోలీసు శాఖకు సూచించారు. అయోధ్యను వివిధ జిల్లాలతో కలిపే ప్రధాన రహదారులపై తగిన పార్కింగ్ ఏర్పాట్లు ఉండాలన్నారు. సందర్శకుల రాకపోకలకు సరిపడా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉండాలి. వారి పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించారు.