పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తుక్కుగూడ ‘జనజాతర’ సభ సక్సెస్ కావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) హర్షం వ్యక్తంచేశారు. ఈ సభా వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాంచ్ న్యాయ్ పత్ర(Paanch Nyayapatra) పేరిట ఆ పార్టీ మేనిఫెస్టో బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు, రాష్ట్రంలోని కీలక నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్స్(X) వేదికగా ఆదివారం కాంగ్రెస్ సభకు హాజరైన కార్తకర్తలపై ఎడిట్ చేసిన వీడియోను పోస్టు చేస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ఈ వీడియో రాహుల్ గాంధీ ఎంట్రీ టైంలో కేజీఎఫ్ బీజీఎం యాడ్ చేసిన విజువల్స్, కార్యకర్తల జోరును హైలెట్ చేస్తున్నది.
https://x.com/revanth_anumula/status/1776819640066547883
‘కాంగ్రెస్ పార్టీ ఓ మహాసముద్రం. అందులో మా కార్యకర్తలు నీటి బిందువులు కాదు పేదల బంధువులు. మా కార్యకర్తలు పొటెత్తే కెరటాలు.. పోరాడే సైనికులు. మా కార్యకర్తలు.. త్యాగశీలులు, తెగించి కొట్లాడే వీరులు. మా కార్యకర్తలు జెండా మోసే బోయిలు మాత్రమే కాదు.ఎజెండాలు నిర్ణయించే నాయకులు. నిన్నటి తుక్కుగూడ గడ్డపై పొటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది.. చేసిన శబ్ధమిది’ అని రేవంత్ రెడ్డి రాసుకొచ్చారు.
ఇదిలాఉండగా, రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు ఉంటే సీఎం రేవంత్ రెడ్డి కేవలం రాజకీయాల మీదే ఫోకస్ పెట్టారని, పదే పదే ఢిల్లీ టూర్లు తిరుగుతూ రాష్ట్ర ప్రజలు, అన్నదాత సమస్యలు, కరువు సమస్యలు, హామీల అమలును గాలికొదిలేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.