జనవరి 22న ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ ఉత్సవం వైభవంగా జరిగిన నేపథ్యంలో రామజన్మభూమికి సంబంధించిన టైటిల్ డీడ్ వివాదాన్ని రేకెత్తిస్తూ, బాబ్రీ మసీదును పద్ధతి ప్రకారం లాక్కున్నారు అంటూ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శనివారం కామెంట్స్ చేసారు. అనేక కోర్టు సమావేశాలు మరియు వ్యాజ్యాలతో కూడిన సుదీర్ఘ ఉద్యమం తర్వాత, సుప్రీం కోర్టు యొక్క ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం హిందువులకు అనుకూలంగా తీర్పుని ఇచ్చింది. బాబ్రీ మసీదుని నిర్మించారు అనే వాదనని ధృవీకరించింది.
16వ శతాబ్దంలో రామజన్మభూమి వద్ద ఉన్న ఆలయ శిధిలాలే అందుకు సాక్ష్యాలు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేసిన సర్వేలో రామమందిరం శిథిలాల మీద మసీదు నిర్మించబడిందని నిర్ధారిస్తూ సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించింది. అయితే.. తీర్పు ఇచ్చిన తరువాత కూడా.. ఒవైసి బాబ్రీ మసీద్ ను హిందువులే లాక్కున్నారు అంటూ కామెంట్ చేసారు. 500 ఏళ్లుగా బాబ్రీ మసీదులో ముస్లింలు నమాజ్ చేశారని, కాంగ్రెస్‌కు చెందిన గోవింద్ బల్లభ్ పంత్ ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు మసీదులో విగ్రహాలు పెట్టారని అన్నారు. ఆ సమయంలో ఆయన అయోధ్య మేజిస్ట్రేట్ గా ఉన్నారని.. రాముడి విగ్రహాలు పెట్టి పూజలు చేసారని అన్నారు.
VHP (విశ్వ హిందూ పరిషత్) స్థాపించబడినప్పుడు అయోధ్యలో రామమందిరం లేదు. రామమందిరం గురించి మహాత్మా గాంధీ ఎప్పుడూ ఏమీ అనలేదు. అని అన్నారు. అయితే, బాబ్రీ మసీదును క్రమపద్ధతిలో మన నుంచి లాక్కున్నారు. జీబీ పంత్ ఆ విగ్రహాలను 1992లోనే తొలగించి, 1992లో మసీదును కూల్చివేయకుంటే.. ఈరోజు మనం చూస్తున్నది జరిగేది కాదని అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా మెజారిటీ ఓట్లని దృష్టిలో ఉంచుకునే మాట్లాడుతున్నారని, అందరూ మెజారిటీ కమ్యూనిటీ ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు అని అన్నారు. ఇప్పుడు ఎవరూ ఈ అన్యాయం గురించి మాట్లాడరని అన్నారు.