Telugu News » Oxygen Gosala : ఆగోశాలలో ఆవులు శ్లోకాలు వింటాయి, భజనలకు కదం తొక్కుతాయి..!

Oxygen Gosala : ఆగోశాలలో ఆవులు శ్లోకాలు వింటాయి, భజనలకు కదం తొక్కుతాయి..!

అది గుడికాదు.ఓ గోశాల కానీ అక్కడ రెండు పూటలా భగవన్నామ స్మరణ జరుగుతుంది.

by sai krishna

అది గుడికాదు.ఓ గోశాల కానీ అక్కడ రెండు పూటలా భగవన్నామ స్మరణ జరుగుతుంది. అక్కడి గోవులు భాగవత శ్లోకాలు( Bhagavata slokas)భక్తి శ్రద్ధలతో వింటాయి. భజనలకు తలాడిస్తాయి.

బాగోగులు చూసే పాలేళ్లతో కాళ్లు కదిపి..పదానికి కదం తొక్కుతాయి. అలనాటి భావగవతోత్తముడు..శ్రీకృష్ణుడి వేణుగాన్నే వింటున్నంత శ్రవణానందకరంగా శ్లోకాలు వింటాయి. బిహార్ (Bihar) లోని విష్ణుపురా గ్రామంలో ఈ విభిన్న ఈ గోశాల ఉంది.

రోజూ ఉదయం, సాయంత్రం శ్లోకాలు వినిపిస్తూ.. గోవుల ముందు భజనలు చేస్తున్నారు. నిత్యం ఆవులకు ప్రత్యేక పూజలు చేస్తూ..ప్రాచీన సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. ఆవులకు శ్లోకాలు, భక్తి గీతాలను వినిపించడం వల్ల అవి నాట్యం చేస్తూ..ఎక్కువ పాలు ఇస్తున్నాయని నిర్వాహకులు వినోద్ సింగ్ చెబుతున్నారు.

పట్నాలోని బిహ్తా బ్లాక్‌లోని ఈ గోశాల ఉంది. కేవలం దేశీయ ఆవులతో గత కొన్నేళ్లుగా నడుస్తున్న ఈ గోశాలకు.. ‘ఆక్సిజన్ గోశాల'(Oxygen Gosala ) అని వినోద్ సింగ్ పేరు పెట్టాడు. ఈ గోశాలలో మొత్తం 500 గిర్ జాతి ఆవులు(Gir cows) వాటి దూడలు ఉన్నాయి.

భారత్లో దేశీ ఆవులు రోజురోజుకు అంతరించిపోతున్నాయని, వాటి రక్షణ కోసం ఇలా గోశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వినోద్ తెలిపారు. దేశీ ఆవుల పరిరక్షణ కోసం ప్రచారం సైతం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

అల్లం, ఉల్లిపాయలను కూడా పశువులకు పెట్టమని పేర్కొన్నారు. ఈ ఆవుల నుంచి వచ్చే పాలను విక్రయించమని..వచ్చిన డబ్బులతో సేవా కార్యక్రమాల కోసం మాత్రమే వినియోగిస్తామని వినోద్ వివరించారు. గానుగ నూనె తీసేందుకు ఎద్దుల వినియోగిస్తాయని ఆయన వెల్లడించారు.

You may also like

Leave a Comment