Telugu News » Kaushik Reddy : కాంగ్రెస్ ఐదేండ్లు పని చేయాలని కోరుకుంటున్నాం…!

Kaushik Reddy : కాంగ్రెస్ ఐదేండ్లు పని చేయాలని కోరుకుంటున్నాం…!

కాంగ్రెస్‌లో మంత్రులు, ఎమ్మేల్యేలు సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)కి రివర్స్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

by Ramu
Padi Koushik reddy comments on Congress

ఐదేండ్ల పాటు కాంగ్రెస్ (Congress) సర్కార్ పని చేయాలని బీఆర్ఎస్ కోరుకుంటోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అన్నారు. కాంగ్రెస్‌లో మంత్రులు, ఎమ్మేల్యేలు సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy)కి రివర్స్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

Padi Koushik reddy comments on Congress

మీడియా పాయింట్‌ వద్ద శుక్రవారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లా డుతూ…..ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారని ప్రశ్నించారు. అసలు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పాథలాజికల్ లయర్, ప్రతి నిత్యం అబద్దాలు ఆడడమే పనిగా పెట్టుకున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాథలాజికల్ లయర్ అంటే రోగ లక్షణ అబద్దాల కోరు అని అర్థమన్నారు.

కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండే అయ్యేదే రేవంత్ రెడ్డి అని తెలిపారు. ఓటుకు నోటు కేసు ట్రయల్స్ పూర్తి అయ్యాయని వివరించారు. మరో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష పడటం ఖాయమన్నారు. హరీశ్ రావుపై చేసిన వ్యాఖ్యలను తాము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

You may also like

Leave a Comment