Telugu News » Pakistan : ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామం.. ఎందుకిలా?

Pakistan : ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామం.. ఎందుకిలా?

తరచుగా జరుగుతున్న దాడుల కారణంగా పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలు చనిపోతున్నారు.

by admin

రాంపల్లి మల్లికార్జున్ రావు, సామాజిక, రాజకీయ విశ్లేషకులు

76 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఎట్లావున్నదో కూడా మనం గమనించాలి. తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. భారత్ ను అస్థిరపరచాలని దురుద్దేశంతో పెంచి పోషిస్తున్న ఉగ్రవాద విషసర్పాలు ఇప్పుడు పాకిస్తాన్ ను కాటు వేస్తూ రక్తపుటేరులు పారిస్తున్నాయి. తరచుగా జరుగుతున్న దాడుల కారణంగా పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలు చనిపోతున్నారు. పాకిస్థాన్ లోని డాన్ పత్రిక తాజా కథనం ప్రకారం ”ఈ సంవత్సరం ఇప్పటివరకు 18 ఆత్మాహుతి దాడులు జరిగాయి. 200 మందికి పైగా చనిపోయారు. 450 మందికి పైగా గాయపడ్డారు.

ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ ఆసియా టెర్రరిస్ట్ పోర్టల్(SATP) తాజా విశ్లేషణ ప్రకారం.. పాకిస్తాన్ లో 80 ఉగ్రవాద తిరుగుబాటు సంస్థలు ఉన్నాయి. వాటిలో 44 గ్రూపులు క్రియాశీలంగా ఉన్నాయి. బలూచిస్తాన్ , సింధు ప్రాంతాలలో ఆత్మహుతి దళాల దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. భద్రతా మండలి తాజా నివేదికలో చెప్పిన విషయాల ప్రకారం పాకిస్తాన్ టిటిపి ఉగ్రవాద సంస్థ దక్షిణ ఆసియాలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలన్నిటినీ ఏకతాటిపై తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నది. ఇదంతా భారత్ పై దాడులు చేసేందుకే. భారత్ ను ఇస్లాం దేశంగా మార్చేందుకే.

పాకిస్తాన్ ఒకవైపు తన అస్తిత్వాన్ని తానే సవాలుగా చేసుకుంటూ, మరోవైపు భారత్ ను అస్థిర పరచే ప్రయత్నం చేస్తున్నది. దేశంలోని కొందరు పాకిస్తాన్ పరిస్థితులు చూసైనా భారతదేశంలో వాళ్ళు ఏ రకంగా జీవిస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకోక పొగా భారత్ లో మరిన్ని పాకిస్తాన్ లను నిర్మాణం చేయాలని నిరంతరం సంఘర్షణలు చేస్తూనే ఉన్నారు. ఈ విషయాలను అర్థం చేసుకోవటంలో ఎక్కడో లోపం కనబడుతునున్నది. ప్రపంచంలో పాకిస్తాన్ దేశం ఒక్కటే ఇస్లాం పేరుతో ఉన్నది. అమెరికాకు చైనాకు ఉపగ్రహంగా ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడి ప్రజలు గందరగోళంలో ఉన్నారు.

ఉగ్రవాదులకు, ఇస్లామిక్ సామ్రాజ్య వాదులకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారిపోయింది. ప్రజలను కలిపి ఉంచటానికి కాశ్మీర్ అక్కడి పాలకులకు తారకమంత్రం. అంతకుమించి ఏమీ లేదు. బలూచిస్తాన్ ప్రత్యేక ప్రతిపత్తి కోసం పోరాటంతో అక్కడ పూర్తి అరాచక పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలను భారత్ తిరిగి స్వాధీనం చేసుకొంటే ఆ దేశం కుప్పకూలేందుకు సిద్ధమైనట్లే. అరవింద మహారుషి చెప్పినట్లు దేశ విభజన సమసిపోవాలి. భారత్ శక్తి వంతమైతే విభజన వివాదం సమసిపోతుంది.

You may also like

Leave a Comment