Telugu News » Tirumala : భయంలో భక్తులు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు చిరుతలు!

Tirumala : భయంలో భక్తులు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదు చిరుతలు!

తిరుమల ఏడో మైలు, నామాల గవి, లక్ష్మి నరసింహస్వామి ఆలయం పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లుగా రికార్డ్ అయ్యింది.

by admin

తిరుమల (Tirumala) నడక మార్గంలో భక్తులు బిక్కుబిక్కుమంటూ ముందుకెళ్తున్నారు. శ్రీవారిని స్మరించుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కి కొండ పైకి వెళ్తున్నారు. చిన్నారిపై చిరుత (Leopord) దాడి తర్వాత టీటీడీ (TTD) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వంద మందిని ఒకేసారి గుంపుగా అనుమతిస్తోంది. చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆ పరిసరాల్లో ఐదు చిరుతలు సంచరిస్తున్నట్టు తెలిసింది. అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్​ కెమెరాలలో ఐదు చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి.

Tirumala Leopard Trapped In Cage

తిరుమల ఏడో మైలు, నామాల గవి, లక్ష్మి నరసింహస్వామి ఆలయం పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లుగా రికార్డ్ అయ్యింది. భక్తులకు వాటి నుంచి రక్షణ కోసం చర్యలకు ఉపక్రమించారు అధికారులు. నామాల గవి ప్రాంతంలో వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించడంతో వారు కేకలు వేశారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో చిరుత ఆ ప్రంతం నుంచి వెళ్లిపోయింది.

ఇటు సోమవారం ఉదయం అధికారుల చేతికి ఓ చిరుత చిక్కింది. చిన్నారిపై దాడి చేసిన చిరుతను పట్టుకునేందుకు నరసింహస్వామి ఆలయం వద్ద 3 బోన్లను ఏర్పాటు చేశారు. ట్రాప్​ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బోనులో ఓ చిరుత చిక్కింది. అయితే.. స్వల్పంగా గాయపడినట్లు వివరించారు అధికారులు. బోనులో చిక్కిన చిరుత పిల్లలే ఆయా ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. నడకమార్గం ద్వారా 15 సంవత్సరాల లోపు పిల్లలకు మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత అనుమతి నిషేధించింది. ఏడో మైలు వద్ద పిల్లల చేతికి ట్యాగ్ ​లు ఏర్పాటు చేస్తోంది. అందులో చిన్నారుల తల్లిదండ్రుల వివరాలు, ఊరు, ఫోన్​ నెంబర్, భద్రత సిబ్బంది టోల్ ఫ్రీ నెంబర్​​ వంటి తదితర వివరాలుంటాయి. నడక మార్గంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా, కృర మృగాల నుంచి రక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

You may also like

Leave a Comment