Telugu News » Pak Miss Universe: కష్టాల్లో పాకిస్తాన్ ఫస్ట్ మిస్ యూనివర్స్…అసలేమైంది?

Pak Miss Universe: కష్టాల్లో పాకిస్తాన్ ఫస్ట్ మిస్ యూనివర్స్…అసలేమైంది?

యూఏఈలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో పాకిస్థాన్ కరాచీలో చెందిన ఎరికా రాబిన్  విన్నర్ గా నిలవడంతో పాటు పాకిస్థాన్ తొలి మిస్ యూనివర్స్ గా రికార్డ్ సృష్టించింది.

by Prasanna
Pakistan model

ఎరికా రాబిన్, పాకిస్తాన్ ఫస్ట్ మిస్ యూనివర్స్(Miss Universe). అందాల సుందరి పోటీల్లో పాల్గొని ఆ కిరీటాన్ని పొందిన పాకిస్థాన్ (Pakistan) యువతి ఎరికా రాబిన్ (Erika Robin) ఇప్పుడు కష్టాల్లో పడింది.  అది కూడా ఆమె గెల్చుకున్న మిస్ యూనివర్స్ టైటిలే ఆమెను కష్టాల్లోకి నెట్టింది. మిస్ యూనివర్స్ టైటిల్ పొందిన ఎరికా రాబిన్ పై పాకిస్థాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలను జారీ చేసింది. అసలు ఏం జరిగింది?

Pakistan model

యూఏఈలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో పాకిస్థాన్ కరాచీలో చెందిన ఎరికా రాబిన్  విన్నర్ గా నిలవడంతో పాటు పాకిస్థాన్ తొలి మిస్ యూనివర్స్ గా రికార్డ్ సృష్టించింది. మిస్ యూనివర్స్‌గా ఎరికా ఎంపికపై పాకిస్తాన్ ప్రభుత్వం పలు అనుమానాలు, సందేహాలతో దర్యాప్తుకు ఆదేశించింది.

మిస్ యూనివర్స్ అందాల పోటీని దుబాయ్ కి చెందిన బిజినెస్ గ్రూప్ యూజెన్ పబ్లిషింగ్  అండ్  మార్కెటింగ్ నిర్వహించింది. పాకిస్థాన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఈ నిర్వహణపై పాకిస్థాన్  ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అయినప్పటికీ ఈ పోటీల్లో పాకిస్తాన్ పేరును ఉపయోగించినట్లు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించింది.

ఈ అందాల పోటీ నిర్వహణ కోసం ఒక వెబ్‌సైట్ లో పాకిస్తాన్‌కు చెందిన 24-28 సంవత్సరాల వయస్సు గల యువతులు  దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మిస్ యూనివర్స్ పాకిస్థాన్-2023 ను ఈ పోటీ ద్వారా ఎంపిక చేస్తామని అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత చాలా మంది ఈ పోటీలకు అప్లై చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన అనేక వడపోతల అనంతరం మిస్ యూనివర్స్ పాకిస్తాన్-2023 పోటీలు జరిగాయి. అందులో కరాచీకి చెందిన 24 ఏళ్ల ఎరికా రాబిన్ మిస్ యూనివర్స్ పాకిస్తాన్-2023 గా ఎంపికైంది.

ఎరికా రాబిన్  క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఎరికా 2020 సంవత్సరంలో మోడలింగ్ ప్రపంచంలోకి ప్రవేశించింది. పాకిస్థాన్‌కు చెందిన కొన్ని మ్యాగజైన్లకు మోడల్ గా పని చేసింది. 2023 నవంబర్ లో శాన్ సాల్వడార్‌లో జరగనున్న మిస్ యూనివర్స్-2023 పోటీలో ఎరికా పాకిస్థాన్ తరపున ప్రాతినిధ్యం కూడా వహిస్తున్నారు.

అయితే అసలు పాకిస్తాన్ కు సంబంధం లేకుండా పాకిస్తాన్ పేరుతో మిస్ యూనివర్స్ పోటీలను ఎలా నిర్వహించారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ విచారణ జరుపుతోంది.  అందులో భాగంగా ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేసి విన్నర్ గా నిలిచిన ఎరికా రాబిన్ ను కూడా విచారించాలని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులను ఆదేశించింది.

You may also like

Leave a Comment