Telugu News » Pakistan: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాక్.. 24వ సారి ఐఎంఎఫ్ సాయం..!  

Pakistan: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాక్.. 24వ సారి ఐఎంఎఫ్ సాయం..!  

పాకిస్థాన్ (Pakistan) తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాయం కోసం అంతర్జాతీయ సంస్థలను వేడుకుంటోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్(IMF) తలుపు తట్టింది.

by Mano
Pakistan: Pakistan in severe financial crisis.. 24th time IMF help..!

పొరుగు దేశమైన పాకిస్థాన్ (Pakistan) తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాయం కోసం అంతర్జాతీయ సంస్థలను వేడుకుంటోంది. తాజాగా తమకు బెయిల్ ఔట్ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్(IMF) తలుపు తట్టింది.

Pakistan: Pakistan in severe financial crisis.. 24th time IMF help..!

ఇలా ఐఎంఎఫ్ నుంచి సాయం కోరడం ఇది 24వ సారి. మరోవైపు ఐఎంఎఫ్ నుంచి 3 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు గతేడాది జూన్‌లో పాకిస్థాన్‌తో ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా వచ్చే ఏప్రిల్ నాటికి 1.1 బిలియన్ డాలర్ల ప్యాకేజీ పాకిస్థాన్‌కు లభించనుంది.

ఆర్థిక సంక్షోభంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ.. ఐఎంఎఫ్ సాయం లేకుండా పాక్ ఆర్థిక వ్యవస్థ మనుగడ సాగించలేదని స్పష్టం చేశారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న తమ దేశం వాటినుంచి గట్టెక్కేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి పైనే ప్రధానంగా ఆధారపడిందని తెలిపారు. నిర్మాణాత్మక సంస్కరణల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అయితే, ఇప్పటికే అనేకసార్లు ప్యాకేజీ పొందిన పాక్, మరోసారి చేతులు చాచింది. 1.1 బిలియన్ డాలర్ల ప్యాకేజీ విడుదలకు సంబంధించి ఐఎంఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే రెండు, మూడేళ్లలో అంతర్జాతీయ సంస్థ సూచించినట్లు పలు కార్యక్రమాలను అమలు చేయాల్సి ఉంటుంది.

You may also like

Leave a Comment