Telugu News » Pakistan: 5లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపిన పాక్..!

Pakistan: 5లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపిన పాక్..!

పాకిస్థాన్(Pakistan) దశాబ్దాలుగా దేశంలో ఉంటున్న దాదాపు 1.7 మిలియన్ల అక్రమ వలసదారులను బహిష్కరించడమే పనిగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 5లక్షల మందికిపైగా అక్రమ వలసదారులను ఆ దేశం నుంచి బహిష్కరించింది.

by Mano
Pakistan: Pakistan sent back 5 lakh illegal immigrants..!

పాకిస్థాన్(Pakistan) దశాబ్దాలుగా దేశంలో ఉంటున్న దాదాపు 1.7 మిలియన్ల అక్రమ వలసదారులను బహిష్కరించడమే పనిగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 5లక్షల మందికిపైగా అక్రమ వలసదారులను ఆ దేశం నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని పాక్ హోం మంత్రిత్వ శాఖ (Pak Home Ministry) పార్లమెంటు ఎగువ సభ (సెనేట్)కి తెలిపింది.

Pakistan: Pakistan sent back 5 lakh illegal immigrants..!

స్వదేశానికి రప్పించడం, బహిష్కరణ ప్రచారం యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించి సెనేటర్ మొహ్సిన్ అజీజ్ ప్రశ్నలకు మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. పాక్‌లో దాదాపు 17 లక్షల మంది అక్రమ వలసదారులు నివాసముంటున్నారని, వీరిలో ఎక్కువ మంది ఆఫ్ఘాన్లు ఉన్నారని వెల్లడించింది. దేశంలో ఉండేందుకు ఎలాంటి చట్టపరమైన పత్రాలు లేకుండానే అక్రమంగా జీవిస్తున్నారని పాక్ తెలిపింది.

అక్రమ నివాసితుల బహిష్కరణ ప్రణాళికకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత దాదాపు 5 లక్షల 41 వేల 210 మంది బహిష్కరణకు గురయ్యారని పాకిస్థాన్‌ చెప్పుకొచ్చింది. మిగిలిన 1.15 మిలియన్లు ఇప్పటికీ నివాసం ఉంటున్నారు. తమ స్వదేశాలకు పంపబడిన 5 లక్షల మంది అక్రమ వలసదారులలో 95 శాతానికి పైగా ఆఫ్ఘాన్ పౌరులే ఉన్నారని సోర్సెస్ ధృవీకరించాయి.

అక్రమ వలసదారులు ప్రవాహాన్ని తీవ్రవాద గ్రూపులతో పాటు వారి మిలిటెంట్లు దేశంలోకి ప్రవేశించడానికి, దాడులు చేయడానికి ఒక సాధనంగా ఉపయోగించుకున్నారని ఆరోపిస్తున్నారు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించేందుకు తమ జాతీయ భద్రత విషయంలో రాజీపడే పరిస్థితి లేదని పాకిస్థాన్ ప్రకటించింది. ప్రపంచ మానవ హక్కుల సంస్థలు లేదా ఆఫ్ఘన్ ప్రభుత్వం లేవనెత్తిన ఆందోళనలపై స్పందించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నిరాకరించింది.

 

You may also like

Leave a Comment