Telugu News » Pakistan : ప్రమాదాలకు నిలయం ఈ ప్రాంతం.. ఇప్పటి వరకు 78 మంది దుర్మరణం..!

Pakistan : ప్రమాదాలకు నిలయం ఈ ప్రాంతం.. ఇప్పటి వరకు 78 మంది దుర్మరణం..!

ఇక్కడ నిర్వహించే గనుల తవ్వకాల విషయంలో సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో తరుచుగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. మే 2018లో, ఇదే ప్రాంతంలోని రెండు పొరుగు బొగ్గు గనులలో గ్యాస్ పేలుళ్ల కారణంగా 23 మంది మరణించారు.

by Venu

పాకిస్తాన్‌ (Pakistan)లో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో మొత్తం 12 మంది కార్మికులు చనిపోయారని సమాచారం.. దక్షిణ పాకిస్తాన్ ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్‌ (Balochistan)లోని బొగ్గు గని కూలిపోయింది. నిన్న సాయంత్రం ఖోస్ట్ మైనింగ్ ప్రాంతంలో ప్రైవేట్ బోగ్గు గనిలో గ్యాస్ పేలుడు సంభవించింది. దీంతో పలువురు కార్మికులు భూమికి 800 అడుగుల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు..

నిన్న ఇద్దరి మృతదేహాలను వెలికి తీసిన రెస్క్యూ బృందం.. నేడు మరో 10 మంది మృ‌తదేహాలను బయటకు తీసినట్లు తెలిపారు. కాగా మొత్తం మృతుల సంఖ్య 12గా తేలిందని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని బలూచిస్తాన్ ప్రావిన్స్ మైన్స్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ (Mines Chief Inspector) అబ్దుల్ ఘనీ బలోచ్ దృవీకరించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. ఈ ప్రమాదం మిథేన్ వాయువు కారణంగా సంభవించినట్లు అంచనా వేస్తున్నారు.

కాగా బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాకు తూర్పున 80 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు గని ప్రమాదంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లో పెద్ద ప్రావిన్సు అయిన బలూచిస్తాన్ అత్యంత వెనకబడిన, తక్కువ జనాభా ఉన్న ప్రాంతం. కానీ విలువైన ఖనిజ నిల్వలకు ఈ ప్రాంతం ముఖ్య కేంద్రంగా ఉంది.

అయితే ఇక్కడ నిర్వహించే గనుల తవ్వకాల విషయంలో సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో తరుచుగా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. మే 2018లో, ఇదే ప్రాంతంలోని రెండు పొరుగు బొగ్గు గనులలో గ్యాస్ పేలుళ్ల కారణంగా 23 మంది మరణించగా.. 11 మంది గాయపడ్డారు. 2011లో మరో బలూచిస్థాన్ కొలీరీలో గ్యాస్ పేలుళ్ల కారణంగా గని కూలిపోవడంతో 43 మంది మరణించారు. తాజాగా 12 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది..

You may also like

Leave a Comment