వరుస ఉగ్రదాడి ఘటనలతో పాకిస్తాన్ (Pakistan) అల్లకల్లోలం అవుతోంది.. ఒకవైపు దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితి.. మరోవైపు ఉగ్ర చర్యలు ఆ దేశాన్ని పాతాళానికి తొక్కేస్తున్నాయి.. తాజాగా ఆత్మాహుతి దాడి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో చైనా (China) డ్రైవర్ సహా ఐదుగురు ఇంజనీర్లు మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
దేశంలోనే రెండో అతిపెద్ద నేవీ ఎయిర్ స్టేషన్ పై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడి మరువకముందే ప్రస్తుత ఘటన కలకలం రేపుతుంది. నేడు చైనా ఇంజనీర్ల కాన్వాయ్.. ఇస్లామాబాద్ (Islamabad) నుంచి ఖైబర్ పఖ్తున్ఖ్వాప్రావిన్స్ (Kyber Fankthunkva Praveens)లో ఉన్న క్యాంప్‌కు వెళుతుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని వెల్లడించిన అధికారులు.. బాంబర్ భారీ పేలుడు పదార్థాలతో వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిపారు.
ఈ ఘటనలో ఆరుగురు చైనా పౌరులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారి మహ్మద్ అలీ గండాపూర్ దృవీకరించారు.. మరోవైపు ప్రమాద సంఘటన గురించి సమాచారం అందుకొన్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నారు. కాన్వాయ్‌లోని మిగిలిన వారికి భద్రత కల్పించారు.
కాగా పేలుడు ధాటికి బస్సు లోయలో పడింది. ఇకపోతే ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదు.. అయితే కాన్వాయ్‌లోని మిగిలిన వ్యక్తులు మాత్రం సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కాగా, ఇదే ప్రాంతంలో 2021లోనూ ఓ బస్సులో జరిగిన పేలుడు కారణంగా తొమ్మిది మంది చైనా పౌరులు సహా మొత్తం 13 మంది మరణించిన విషయం తెలిసిందే..