తెలంగాణ (Telangana)లో ప్రస్తుతం ఎక్కడ చూసిన బహిరంగ సభలు.. సమావేశాలతో ప్రధాన పార్టీలన్నీ యమ బిజీగా మారిపోయాయి. క్షణం కూడా తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నాయి. మరోవైపు మాయ మాటలు చెబుతూ గ్రామాల్లో తిరుగుతున్న మోసపూరిత కాంగ్రెస్ (Congress)..బీజేపీ (BJP)కి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని బీఆర్ఎస్ (BRS) పిలుపునిస్తుండగా.. సేమ్ టు సేమ్ రాగాన్ని కాంగ్రెస్, బీజేపీ కూడా ప్లే చేస్తున్నాయి.
ఈ ఎన్నికల ప్రచారంలో ఎవరి గోల వారిదే.. మరోవైపు పాలకుర్తిలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 80 సీట్లు రావడం గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడవ సారి అధికార పగ్గాలు చేపట్టి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందని జోస్యం చెప్పారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
తన సర్వేలు, అంచనాలు ఎప్పుడు తప్పు కాలేదన్న ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao).. ఈ సారి పాలకుర్తిలో తాను 60 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ ను నమ్మని తెలంగాణ ప్రజలు ఇంకా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఎలా నమ్ముతారని విమర్శించారు. రేవంత్ ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే అని ఎర్రబెల్లి దయాకర్ ఎద్దేవా చేశారు.
మరోవైపు పాలకుర్తి నియోజకవర్గానికి (Palakurthi-Constituency) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేకత ఉంది. కంచుకోటగా మార్చుకున్నఈ నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమం ఎగసినపడిన సమయంలోనూ తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన ఎర్రబెల్లికి పాలకుర్తిలో తిరుగు ఉండదనే టాక్ ఉంది. కానీ ఈ ఎన్నికల పోరు చాలా టఫ్ గా ఉన్న నేపథ్యంలో పాలకుర్తి పాలిటిక్స్ లో చోటు చేసుకునే మార్పులపై ఆసక్తి పెరిగింది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే ఎన్నికల రిజల్ట్ వరకు ఆగవలసిందే..