దక్షిణ కొరియా(South Korea)కు చెందిన ప్రముఖ పాప్ సింగర్ పార్క్ బో రామ్(30) ఆకస్మికంగా మృతిచెందింది. అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమెకు దక్షిణ కొరియా పాప్ సింగర్(Pop Singer)గా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉంది.
2014 తన ‘సింగిల్ బ్యూటిఫుల్’ ఆల్బమ్ రిలీజ్ కావడంతో ఆ పాప్ సింగర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇంకా ‘గావ్ చాట్’ అనే మ్యూజిక్ అవార్డ్స్ లో ‘ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్’ గా కూడా అవార్డు గెలుచుకుంది. పార్క్ బో రామ్(Park Bo Ram)మృతికి సమయానికి కొన్ని గంటల ముందు తన స్నేహితులతో ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్న ఈమె వారి స్నేహితులతో కలిసి మద్యం సేవించినట్లు తెలుస్తోంది.
రాత్రి 10 గంటల సమయంలో ఆమె రెస్ట్ రూమ్ కు వెళ్ళగా ఎంతసేపైనా రాకపోవడంతో ఆమె స్నేహితులు వెళ్లి చూశారు. అయితే అక్కడ అపస్మారక స్థితిలో కనపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పార్క్ బో రామ్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
17ఏళ్ల వయసు నుంచే పార్క్ బో రామ్‌కు సంగీతంపై ఆసక్తి ఉండేది. 2010 సంవత్సరంలో సూపర్ స్టార్ కే 2 పాటల పోటీలో పాల్గొని తన టాలెంట్‌ను నిరూపించుకుంది. అప్పటి నుంచి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. తమ అభిమాన పాప్ సింగర్ మృతి విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Park Boram has passed away at the age of 30. pic.twitter.com/E2PfluIwfc
— Kpop Charts (@kchartsmaster) April 11, 2024