దేశంలో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) సందడి కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి వ్యూహరచనలో మునిగిపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే కావలసిన అస్త్రశస్త్రలను సిద్ధం చేసుకొని.. షెడ్యూల్ వచ్చిన వెంటనే సమరానికి దిగేలా ప్లాన్ లో ఉన్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో మార్చి రెండో వారంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే చాన్స్ ఎక్కువగా ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు మార్చి 7వ తేదీ లోపే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోవత్సవాలు చేయాలని మోడీ (Modi) నిర్ణయించుకొన్నట్లు టాక్ వినిపిస్తుంది. కాగా ప్రధాని మోడీ ప్రస్తుతం తీసుకొన్న నిర్ణయం ఈ ప్రచారాలకు మరింత బలం చేకూరుస్తోందని అనుకొంటున్నారు.
ఇప్పటికే ఆయా మంత్రిత్వశాఖల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలని ప్రధాని కేంద్రమంత్రులను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే ఈ నెల 25న దేశంలో నూతనంగా నిర్మించిన 5 ఎయిమ్స్ ఆసుపత్రులను (AIIMS Hospitals) జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 28న విశాఖ (Visakha)లో హెచ్‌పీసీల్ (HPCL) కార్యక్రమంలో పాల్గొననున్నారు.
అన్ని పనులు మార్చి 7 లోపు పూర్తి చేసుకోవాలని మోడీ మంత్రులను ఆదేశించడంతో.. మార్చి సెకండ్ వీక్‌లో షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే మోడీ మంత్రులను ఆదేశించినట్లు టాక్ వినిపిస్తోంది.. ఈ క్రమంలో మార్చి సెకండ్ వీక్‌లో ఎన్నికల నగారా మోగనున్నట్లు చర్చించు కొంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని పొలిటికల్ పార్టీలన్నీ తమ పనుల్లో వేగం పెంచుతున్నాయి. గెలుపే లక్ష్యంగా సిద్దం అవుతు